22-03-2025 05:28:21 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో 115 మంది హనుమాన్ భక్తులు అర్ధమండల దీక్షలను భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 5 గంటల నుండి అర్చకులు ఒజ్జల శిరీష్ శర్మ, శ్రీనివాసశర్మ, శేఖరశర్మల ఆధ్వర్యంలో గణపతి పూజ, నవగ్రహపూజ, ఆంజనేయస్వామికి రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామపూజ, మంగళహారతి, మహా మంత్రపుష్పం, మహా ఆశీర్వచనం, తీర్థ ప్రసాదవితరణ చేశారు.
అనంతరం దీక్షాపరులకు మాలధారణ కార్యక్రమాన్ని అత్యంత కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం దీక్షా కాలంలో స్వాములు పాటించవల్సిన నియమ సంబంధనలను భక్తులకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పిన్నా వివేక్, ధర్మపురి వెంకటేశ్వర్లు, రూప్నర్ రమేష్, ఎకిరాల శ్రీనివాస్. నారాయణమూర్తి, లక్ష్మణమూర్తి, మధు, సుధాకర్, గణపతి, సత్యనారాయణ, తిరుపతి, స్వాములు, భక్తులు పాల్గొన్నారు