11-12-2024 02:16:01 AM
కలెక్టరేట్‌లో దళిత నాయకులతో సమావేశమైన ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్
రంగారెడ్డి, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వికారాబాద్, మేడ్చల్ మాల్క్‌జిగిరికి చెందిన పలువురు దళిత నేతల కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన వివచారణకు హాజరై ఫిర్యాదులను అంద జేశారు.
ఎస్సీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ఏకసభ్య కమిషన్ నియమించింది. హైకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ షమీమ్ అక్తర్ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు.
తాజా సమా వేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మాలలు, మాదిగలు, జంగములు, చిందు లు, బేడబుడుగ జంగములు, బైండ్ల, మం గులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు తమ సమస్యలను కమిషన్‌కు వివరించి రాతపూర్వకంగా ఫిర్యాదులను సమర్పించారు.
అనంతరం షమీమ్ అక్తర్ ఇబ్రహీం పట్నం మండలం పోచారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసిం గ్, రాష్ట్ర షెడ్యూల్ కులాల అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు.