calender_icon.png 24 January, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహ్వానం అందింది..

14-08-2024 12:05:00 AM

నటి, కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజుకు అరుదైన గౌరవం దక్కింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో నిర్వహించే ఎట్‌హోమ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం పలుకుతూ సంధ్యకు లేఖ అందింది. తన తొలి చిత్రం ‘నాట్యం’తో రెండు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది సంధ్యారాజు.

తమిళనాడుకు చెందిన హైదరాబాద్‌లో నిశంఖల డ్యాన్స్ అకాడెమీ, నిశంఖల ఫిల్మ్ ఫౌండర్‌గా అనేక కార్యకలాపాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష నృత్య ప్రసారాల్లో పాల్గొనడమే కాకుండా, చలనచిత్ర రంగంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. నటిగా, క్లాసికల్ డ్యాన్సర్‌గా, కొరి యోగ్రాఫర్‌గా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్న సంధ్యా ఆగస్టు 15న సాయంత్రం ఎట్‌హోమ్ ఆహూతులయ్యే అతిథులతో సమావేశమవుతారు.