calender_icon.png 19 January, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4 లక్షల సుజుకీ స్కూటర్ల రీకాల్

28-07-2024 01:34:39 AM

చెన్నై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా  దాదాపు 4 లక్షల స్కూటర్లను రీకాల్ చేసింది. ఆ సంస్థ తయారు చేసిన యాక్సెస్125 , అవెనీస్ 125, బర్గ్‌మాన్ స్ట్రీట్ మోడళ్లు రీకాల్ చేసినవాటిలో ఉన్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (సియామ్) వెబ్‌సైట్‌లో ఆ వివరాలను కంపెనీ పొందుపరిచింది. ఇందులో అత్యధికంగా 2.63 లక్షల ద్విచక్ర వాహనాలు సుజు కీ యాక్సెస్ మోడల్‌వే ఉన్నాయి. అవెనీస్ 1.25 లక్షలు, బర్గ్ మాన్ స్ట్రీట్ స్కూటర్లు 72 వేలు ఉన్నాయి. ఇగ్నినిషన్ కాయిల్‌లో భాగంగా వినియోగించే హై-టెన్షన్ కోర్డ్‌లో లోపాన్ని గుర్తించిన కారణంగా ఈ రీకాల్ చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది. 2022 ఏప్రిల్ 30 నుంచి అదే ఏడాది డిసెంబర్ 3 మధ్య తయారుచేసిన వాహనాల్లో ఈ లోపాన్ని గుర్తించినట్లు కంపెనీ పేర్కొంది.ఈ లోపం వల్ల ఇంజిన్ మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. 

హై టెన్షన్ కోర్డ్ నీటిలో తడిస్తే వాహనం స్పీడ్ సెన్సర్‌పై ప్రభావం పడి స్పీడ్ డిస్‌ప్లే నిలిచిపోయే అవకాశమూ ఉందని పేర్కొం ది. రీకాల్ ప్రక్రియను ఇప్పటికే సుజుకీ చేపట్టింది. ఆయా వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులను సంప్రదిస్తోంది. దగ్గర్లోని సర్వీస్ సెంటర్లో ఉచితంగానే సంబంధిత పార్ట్‌ను రీప్లేస్ చేసి ఇస్తామని కంపెనీ పేర్కొంది.