calender_icon.png 12 January, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుంధతీకి మందలింపు

08-10-2024 12:05:22 AM

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత పేసర్ అరుంధతీ రెడ్డిని ఐసీసీ మందలించింది. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నిదా దర్‌ను ఔట్  చేసిన అరుంధతీ పెవిలియన్‌కు వెళ్లు అన్నట్లు కోపంగా సైగలు చేసింది. పాక్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అరుంధతీ ప్రవర్తనను తప్పుబ ట్టిన ఐసీసీ తొలి తప్పు కింద ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.

కాగా అరుంధతీ ఐసీసీ ఎదుట తన తప్పును అంగీకరించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎవరైనా దురుసగా ప్రవర్తిస్తే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 కింద ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు. రెండేళ్ల కాలంలో మరోసారి ఈ తప్పు చేస్తే పాయింట్లలో కోత విధించడంతో పాటు వేటు వేసే అవకాశముంటుంది.