calender_icon.png 21 September, 2024 | 6:10 AM

కొమ్మూరిపై తిరుగుబాటు..!

21-09-2024 01:09:34 AM

డీసీసీ కుర్చీకి నిరసనల గండం

జనగామ కాంగ్రెస్‌లో రాజుకుంటున్న వివాదం

ప్రతాప్‌రెడ్డిని కుర్చీ దింపేందుకు ఎత్తులు

అధ్యక్ష పీఠంపై ఇతర నేతల చూపు

జనగామ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి ): జనగామలో గ్రూపు రాజకీయాలు డీసీసీ అధ్యక్షుడితో పాటు పార్టీని గందరగోళానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీలో డీసీసీ అ ధ్యక్ష పదవికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన చో ట డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఇన్‌చార్జిలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఈ క్రమంలో జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీ ఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచినప్పటికీ ఆయనపై ఓడిపోయిన కొమ్మూరి ప్ర తాప్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో ఆ యన హవానే కొనసాగుతోంది. కానీ సొంత పార్టీలో వర్గ పోరు ఆయనను సతమతం చే స్తోంది. ఎన్నికల ముందు ఇక్కడ పొన్నాల ల క్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్గాలు ఉ న్నాయి.

పొన్నాల బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో కొమ్మూరికి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. కొన్ని రోజులు అంతా బాగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. కొమ్మూరి ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వచ్చాయి. కొందరు నా యకులు వ్యతిరేకవర్గంగా తయారై కొ మ్మూరి నాయకత్వంపై కొన్ని నెలలుగా పో రాటం చేస్తున్నారు. 

నల్లగొండ నాయకుల పెత్తనం?

జనగామలో గ్రూపు రాజకీయాలు కాం గ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ఉమ్మడి న ల్గొండ జిల్లా నాయకులు జనగామపై పెత్త నం కోసం పాకులాడుతున్నారనే వాదన వి నిపిస్తోంది. జనగామలో పంద్రాగస్టు, ప్రజా పరిపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరుకావడంతో ఈ వాదనకు బలం చే కూరుతోంది. మరోవైపు కొమ్మూరి వ్యతిరేక వర్గం నాయకులు నిత్యం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్‌రెడ్డిని కలుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనగామ జనరల్ స్థానం కావడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతంతో అవసరం పడుతుందనే ఉద్దేశంతో ఆ నాయకులు ఈ ప్రాంతంపై పెత్తనం చెలాయిస్తూ, బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొమ్మూరి వర్గం నాయకులే ఓ సందర్భంలో చెప్పారు.

కొమ్మూరిని కుర్చీ నుంచి దింపేందుకు..

పార్టీ సీనియర్లకు కొమ్మూరి ప్రాధాన్య ం ఇవ్వడం లేదంటూ జనగామ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లు వేమల్ల సత్యనా రాయణరెడ్డి, కంచ రాములు, మార్కెట్ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, జిల్లా నేత మాసాన్‌పల్లి లింగాజీ కొమ్మూరి వ్య తిరేక వర్గంగా తయారయ్యారు. కొన్ని రో జులుగా ఆయన నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రిత ం జనగామ మండలం శామీర్‌పేట శివారులో వృద్ధాశ్రమ ప్రారంభోత్సవానికి మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి, మంత్రి సీతక్క హాజరుకాగా.. వారికి స్వా గతం పలుకుతూ కొమ్మూరి వ్యతిరేక వర్గ ం నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పా టు చేశారు. కొమ్మూరి ఫొటో లేకుండా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అ ప్పట్లో వివాదం రాజుకుంది.

ఇటీవల జ నగామలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ ఇదే సీన్ రిపీ ట్ అయింది. ఇది తట్టుకోలేని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పలువురు నాయకులపై అక్ర మ కేసులు పెట్టించారనే ఆరోపణలు వినిపించాయి. ఎర్రమల్ల సుధాకర్ కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించగా ఇది కొమ్మూరి అనుచరులే చేశారని బా ధితుడు జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా ప్రజాపాలన దినోత్సవ ం సందర్భంగా జనగామ కలెక్టరేట్‌లో కొ మ్మూరిని వేదిక పైనుంచి దిగేవరకు ఆ యన వ్యతిరేక వర్గం గొడవ చేసింది. ఈ పరిణామాలన్నింటిని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి కార్యకర్తలు తీసుకెళ్తున్నారు. 

డీసీసీ కుర్చీపై ఖర్చీఫ్

కొమ్మూరిని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని వ్యతిరేక వర్గం పోరాటం చేస్తుండగా.. ఆ కుర్చీని దక్కించుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తు న్నారు. పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జి సింగపురం ఇందిర డీసీసీ పీఠం కోసం ఆరాటపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే తమ నియోజకవర్గాలతో పాటు జనగామ నియోజకవర్గంలోని అన్ని మండలాల కీలక నేతలతో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్య నాయకుల మద్దతు కూడ గట్టుకోవడమే కాకుండా సీఎం రేవంత్‌రెడ్డికి తమ ప్రపోజల్ పంపినట్లు సమా చారం. సింగపురం ఇందిర కొత్త టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది.