13-03-2025 01:47:30 AM
తుడుందెబ్బ రాష్ర్ట కో కన్వీనర్ గణేశ్
ఆదిలాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : టైగర్ జొన్ పేరిట ఆదివాసి గ్రామాలను తరలించే కుట్రలు ఇకనైనా అపాలని, లేకుంటే ఆదివాసులు ఫారెస్ట్ అధికారులపై తిరగబడాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ)రాష్ర్ట కో కన్వీన గోడం గణేష్ స్పష్టం చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని రింగారిట్ గ్రామంలో ఇటీవల చెట్లు నరికారు అనే నేపంతో గ్రామ పటేల్ కోవ జంగు, కోవ రాములను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మావల మండలం కొమురం భీం కాలనీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో గణేష్ మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అక్రమంగా అరెస్ట్ చేసిన అమాయక ఆదివాసిలను అటవీశాఖ అధికారులు, రాష్ర్ట ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి వారిపై పెట్టిన ఆక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి డిమాండ్ చేశారు. లేకుంటే ఆసిఫాబాద్ ఫారెస్ట్ జిల్లా కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు వెట్టి మనోజ్, గోడం రేణుక, ఉయిక ఇందిర, సోయం లలిత, నాగరావ్, గెడం గణేష్, అనంద రావు తదితరులు ఉన్నారు.