calender_icon.png 12 March, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ అరెస్టులు చేస్తే ఫారెస్ట్ అధికారులపై తిరుగుబాటు : తుడుం దెబ్బ

12-03-2025 01:04:45 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): టైగర్ జొన్(Tiger zone) పేరిట ఆదివాసి గ్రామాలను తరలించే కుట్రలు ఇకనైనా అపాలని, లేకుంటే ఆదివాసులు ఫారెస్ట్ అధికారులపై తిరగబడాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర కో కన్వీన గోడం గణేష్ స్పష్టం చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని రింగారిట్ గ్రామంలో ఇటీవల చెట్లు నరికారు అనే నేపంతో గ్రామ పటేల్ కోవ జంగు, కోవ రాము లను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ  మావల మండలం కొమురం భీం కాలనీ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో గణేష్ మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారుల పై తీవ్రస్థాయిలో ధ్వమెత్తారు.