calender_icon.png 6 March, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ కుటుంబాలకు భరోసానివ్వండి

06-03-2025 12:07:59 AM

మహబూబ్ నగర్, మార్చి 5 (విజయక్రాంతి): మీరు బాగా చదివితేనే మీ కుటుంబం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మూసాపేట్ మండలంలో జడ్.పి.హె.ఎస్ పాఠశాలలో అదనపు తరగతుల గదులను ప్రారంభించడంతోపాటు అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అనంతరం కాలినడకన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే; మాట్లాడు తూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పాఠశాలలో మౌలిక వసతులను పట్టించుకోలేదని, పదేళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడంతో పాటు 11,062; టీచర్ పోస్టులు భర్తీ చేశామని, 15 ఏళ్ల తర్వాత సుమారు 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలల్లో మౌలి క వసతులు కల్పించామని, స్కూలు ప్రారంభమైన మొదటి వారంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం లు పంపిణీ చేశామని, పదేళ్లలో ఎన్నడు లేని విధంగా విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీ లు పెంచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.