calender_icon.png 20 April, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ నేతకు నెల్లూరి పరామర్శ కుటుంబానికి భరోసా

11-04-2025 12:13:37 AM

ఖమ్మం, ఏప్రిల్ 10 ( విజయక్రాంతి ):-బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు కు పితృవియోగం కలిగిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు గురువారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు . కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈవి రమేష్, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాం రాథోడ్, నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ని వీరంరాజు, జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా, జిల్లా అధికార ప్రతినిధి మధుసూదన్ రావు, సుబ్బారావు, రవీందర్ పరామర్శకు వచ్చారు.

ఇక మండల అధ్యక్షులైన పాలకొల్లు శ్రీనివాస్, బానోతు విజయ్, గొర్ల ప్రభాకర్ రెడ్డి, నరసింహారావు, చల్లా నాగులు, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రసాద్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రాంబాబు, నాగస్వామి, సీనియర్ నాయకులు వెంకటరామారావు, సాయిచంద్, రమేష్, మంద శివ, సాలి శివ, చీకటి వసంతరావు, కార్తీక్ సుధాకర్ తదితరులు కూడా పాల్గొని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.