calender_icon.png 8 January, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుని కుటుంబానికి మేమున్నామనే భరోసా

06-01-2025 07:25:36 PM

రూ. 20 వేల ఫిక్స్డ్ బాండ్ అందజేత... 

ఇల్లెందు (విజయక్రాంతి): తమతో చదువుకున్న స్నేహితుడు కష్టాల్లో ఉంటే తోటి స్నేహితులు ఆ కుటుంబానికి భరోసాగా నిలవడం అరుదు. కానీ ఆ స్నేహితుడికి మేమున్నామని దైర్యం, అండగా ఉంటామని కొందరు స్నేహితులు ముందుకురావడం గర్వకారణం. ఇదే కోవలో తమతో విద్యనభ్యసించిన మిత్రుడు ఆరోగ్యం బాగాలేక మృతి చెందడంతో ఎదో ఒకరకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకున్నారు ఆ తోటి మిత్రులు. ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీకి చెందిన యుద్ధమూరి వెంకటేశ్వర్లు రెండు కిడ్నీలు చేడిపోయి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి, వారి స్నేహితుడి పాప పేరుపై రూ. 20 వేలను ఫిక్స్ చేసి బాండ్ ను అందజేశారు.

అంతేకాకుండా తమతో చదివిన మరికొంత మంది స్నేహితులు సైతం వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన కుటుంబాలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం జరిగిందని స్నేహితుడు పోరండ్ల సునీల్ తెలిపారు. తమతో పాటు చదువుకున్న స్నేహితులకు ఎలాంటి కష్టం వచ్చిన మిగిలిన స్నేహితులు కలిసి ఆయా కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ స్నేహితులకు ఎలాంటి కష్టం వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని పోరండ్ల సునీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు ముద్దుల సునీల్, పి. నారాయణ, కిషన్, కుమారస్వామి, అశోక్, జానీ పాషా, కవిత, సరిత తదితరులు పాల్గొన్నారు.