07-02-2025 01:25:25 AM
జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఇతరుల చేతిలో అత్యాచారానికి గురై బాధింపబడిన వారికి అత్యంత రహస్యంగా మేలైన రక్షణ కల్పించే లక్ష్యమే భరోసా కేంద్రం ఉద్దేశమని నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా భరోసా కేంద్రం ద్వారా సుమారు 87 మంది మహిళలకు రక్షణ కల్పించడం జరిగిందన్నారు. వారికి వైద్యం, న్యాయ సలహాలతో పాటు ఆర్ధిక భరోసా ఇతర రక్షణ కల్పించే బాధ్యత భరోసాపై ఉందన్నారు.
ఆపరేషన్ స్ముల్ ముస్కాన్ ద్వారా జిల్లా పోలీసు యంత్రాంగం 33మంది బాల కార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పించినట్లు గుర్తు చేశారు. వారితోపాటు అదనపు ఎస్పీ రామేశ్వర్ తదితరులు ఉన్నారు.