ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటానుకోట్ల మంది మూర్ఛవ్యాధితో బాధ పడుతున్నారు. మన దేశమూ తక్కువ స్థాయిలో ఏమీ లేదు. వెయ్యిలో కనీసం 22 మందిలో ఈ రుగ్మత కనిపిస్తున్నది. వీరికి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూర్ఛరోగ నిర్ధారణ, చికిత్స, వ్యాధిగ్రస్తులకు చేయూత ఇవ్వడం వంటి అంశాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకు ప్రజల్లో లోతైన అవగాహన కల్పించాలి. వ్యాధిగ్రస్తులు ఎదుర్కొంటున్న సవాళ్లు, దురభిప్రాయాలను రూపుమాపడం, ధైర్యాన్ని ఇవ్వడం, చికిత్స వివరాలు తెలుపడం, సదస్సులు/ కార్యశాలలు/ చర్చలు/ వీధి ప్రదర్శనలు వంటివి చేయాలి.
- డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి, కరీంనగర్