calender_icon.png 24 October, 2024 | 7:51 PM

పెళ్లి తర్వాత లావుకి కారణం ఇదే!

04-06-2024 12:05:00 AM

పెళ్లికి ముందు సన్నగా ఉండే అమ్మాయిలు పెళ్లున తర్వాత లావు అవుతుంటారు. ఎందుకు అలా కొన్నాళ్లకు లావు అవుతారని సందేహం చాలా మందికి వస్తుంటుంది. అలా అవ్వడానికి గల కారణాలు ఏంటో  తెలుసుకుందాం..

ఫంక్షన్స్

పెళ్లి అంటే దాంతో ముడిపడి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. పెళ్లి చూపులు, ఎంగేజ్ మెంట్, హల్దీ చివరికి పెళ్లి తంతు ఉంటుంది. ఈ ఫంక్షన్లలో రకరకాల పిండివంటలు, జంక్ ఫుడ్ తినడం వల్ల సన్నగా ఉన్న అమ్మాయిలు  లావుగా అవుతారని అంటారు. కానీ ఈ ఫంక్షన్స్ అన్నీ అబ్బాయిలకు కూడా ఉంటాయి. అయితే అబ్బాయిలు అంతో ఇంతో పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. కానీ అమ్మాయిలకు పెళ్లి సందర్భంగా చేసే పను లేమీ ఉండవు.

ఆహారం

పుట్టింట్లో, మెట్టినింట్లో ఫుడ్ కల్చర్ వేర్వేరుగా ఉండొచ్చు. కాబట్టి ఒక్క సారిగా మనం తీసుకొనే ఆహార పదార్థాలు, ఆహారం తీసుకొనే టైమింగ్‌లో తేడాలు ఉండటం వల్ల కూడా అమ్మాయిలు లావు అయిపోతుంటారు. పెళ్లున కొత్తలో రాత్రుళ్లు ఆలస్యంగా తినడం.. లేదా తెలిసిన వారు రావడంతో వారితో కలిసి తినడం, ఇంకా పార్టీస్ ఇలాంటి వాటి వల్ల.. కేలరీలు పెరిగి పోషకాలు తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటారు. దీంతో లావయ్యే అవకాశాలు ఉంటాయి.