calender_icon.png 23 October, 2024 | 3:51 AM

రియల్టీ కింగ్ డీఎల్‌ఎఫ్ రాజీవ్ సింగ్

12-07-2024 12:05:00 AM

రూ.1,24,420 కోట్ల సంపద

ముంబై, జూలై 11: డీఎల్‌ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ రూ.1,24,420 కోట్ల సంపదతో దేశంలో అత్యంత ధనిక రియల్ ఎస్టేట్ వాణిజ్యవేత్తగా నిలిచారు. రియల్ ఎస్టేట్ వాణిజ్యంలో   గ్రోహెహురున్ విడుదల చేసిన శ్రీమంతుల తాజా జాబితా ప్రకారం మాక్రోటెక్ డెవలపర్స్ వ్యవస్థాపకుడు మంగళ్‌ప్రభాత్ లోధా రూ.91,700 కోట్ల సంపదతో ద్వితీయస్థానంలో ఉన్నారు. దేశీయ కుబేరుల్లో ద్వితీయస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ మాత్రం గ్రోహ్‌హురున్ టాప్ రియాల్టర్ల జాబితాలో తృతీయస్థానంలో నిలిచారు. అదానీ రియల్టీని ఈ ఏడాది టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీల జాబితాలోకి చేర్చడం ద్వారా గౌతమ్ అదానీ, కుటుంబం సంపద రూ.56,500 కోట్లకు చేరిందని హురున్ తెలిపింది.

రూ.44,820 కోట్ల సంపదతో ఒబెరాయ్ రియల్టీ అధిపతి వికాస్ ఒబెరాయ్ నాల్గవ స్థానంలో నిలిచారు. రహేజా గ్రూప్ చీఫ్ చంద్రు రహేజా (రూ.43,710 కోట్లు), ఫినిక్స్ మిల్స్ అధిపతి అతుల్ రుయా (రూ.26,370 కోట్లు), బాగ్మనే డెవలపర్స్ చైర్మన్ రాజా బాగ్మనే (రూ.19,650 కోట్లు), ఎంబసీ ఆఫీస్ పార్క్స్ అధినేత జితేంద్ర వీర్వాని (రూ.16,000 కోట్లు) తదుపరి స్థానాల్లో ఉన్నారు. రూ.13,970 కోట్ల సంపదతో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ యజమానులు ఇర్ఫాన్ రజాక్, రెజ్వాన్ రజాక్, నోమాన్ రజాక్‌లు తొమ్మిదో స్థానంలో నిలిచారు. రియల్ ఎస్టేట్ కంపెనీలన్నింటిలోకి రూ.2 లక్షల కోట్ల మార్కెట్ విలువతో డీఎల్‌ఎఫ్ అగ్రస్థానంలో ఉండగా, రూ.1.4 కోట్ల మార్కెట్ విలువతో మాక్రోటెక్ డెవలపర్స్ ద్వితీయస్థానంలో నిలిచింది.