calender_icon.png 23 December, 2024 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజంగా సారీ..

22-12-2024 12:45:24 AM

రష్మిక మందన్నా చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా కాలం గడిపేస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్‌కు రష్మిక వీరాభిమాని. ఈ క్రమంలోనే ఆమెకు అవకాశం దొరికితే విజయ్ గురించి చెబుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా గురించి మాట్లాడారు. తాను ఇంటర్వ్యూలో చూసిన మొదటి సినిమా ‘గిల్లి’ అని.. దానిని తెలుగులో వచ్చిన ‘పోకిరి’కి రీమేక్‌గా రూపొందించారని చెప్పారు.

దీంతో అమ్మడిని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. వాస్తవానికి ‘గిల్లి’ సినిమాను ‘ఒక్కడు’కు రీమేక్‌గా తెరకెక్కించారు. కానీ రష్మిక ‘పోకిరి’కి రీమేక్ అని చెప్పి ట్రోలర్స్‌కి అడ్డంగా దొరికిపోయారు. తాజాగా రష్మిక తెలుగులో ఓ పోస్టుకు రిప్లు పెట్టారు. “సారీ. గిల్లి సినిమా ఒక్కడు చ్రితానికి రీమేక్ కదా. ఆ విషయం ఇంటర్వ్యూ అవగానే నాకు గుర్తొచ్చింది. సోషల్ మీడియాలో దీనిని పక్కాగా వైరల్ చేస్తారనుకున్నా. నిజంగా సారీ. నాకు వాళ్లు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే” అంటూ ఫన్నీ ఎమోజీలను యాడ్ చేశారు. విజయ్‌తో కలిసి రష్మిక ‘వారిసు’ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ‘కుబేర’, ‘సికిందర్’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలున్నాయి.