సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ రంగం గత ఆర్నెల్లుగా హైదరాబాద్‌లో పుంజుకున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆఫీస్ స్పేస్ లీజ్ రంగంలో 40 శాతం వృద్ధిలో దూసుకెళుతోందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ ఏడాదిలో మొత్తం 50 లక్షల చదరపు అడుగల స్థలం అద్దెకు వెళ్లిందని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి లావాదేవీల్లో 40 శాతం వృద్ధి కనిపించిందన్నారు. ఈ విషయాన్ని స్థిరాస్తి సేవల సంస్థ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించిందని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇమేజ్‌ను పునర్నిర్మిస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరికీ అవకాశాలను సృష్టిస్తామని పేర్కొన్నారు.