calender_icon.png 23 February, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ గేమ్‌ఛేంజర్! ట్రిపుల్ ఆర్

23-02-2025 12:00:00 AM

  1. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రియల్ ఎస్టేట్ బూమ్
  2. హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా సిద్ధం కానున్న 2050 మాస్టర్‌ప్లాన్ 
  3. ట్రిపుల్ ఆర్ వరకు పెరగనున్న హెచ్‌ఎండీఏ పరిధి
  4. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్న ప్రభుత్వం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం డౌన్‌ఫాల్ అయ్యిందా..? హైదరాబాద్ మహానగరంలో నిర్మాణ రంగానికి గతం లో ఉన్నంత బూమ్ లేదా..? అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే.. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన దగ్గర్నుంచి రియల్ ఎస్టేట్  రంగం భవిష్యతుపై చర్చ నడుస్తూనే ఉంది.

ఇదేఅంశం అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య కొనసాగే విమర్శలకు ప్రధాన అస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనేక కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. మహానగరం లో భవిష్యత్తులో నిర్మాణ రంగానికి మరింత బూమ్ వచ్చేలా రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును ముందుకు తీసుకొస్తోంది.

హైదరాబా ద్‌లో ప్రస్తుతం 2030 మాస్టర్‌ప్లాన్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) ప్రాజెక్టు కొనసాగుతున్నప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2050 మాస్టర్‌ప్లాన్‌కు రంగం సిద్ధం చేస్తోం ది.

ఓఆర్‌ఆర్ అవతలివైపు మరో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి కొత్తగా నిర్మాణం చేసే ట్రిపుల్ ఆర్‌కు అప్పటికే ఉన్న ఓఆర్‌ఆర్‌కు కనెక్టివిటీ చేయాలని భావిస్తోంది. దీంతో హైదరాబాద్ మహానగరం ఓఆర్‌ఆర్ నుంచి కొత్తగా నిర్మించే ఆర్‌ఆర్‌ఆర్ దాకా విస్తరించనుంది. 

2050 మాస్టర్ ప్లాన్‌తో..

హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ ఉంటుందని ప్రభుత్వం చెబుతోం ది. ఈ ప్లాన్ రాబోయే 20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉండేలా ప్రభు త్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

కొత్త మాస్టర్‌ప్లాన్ (2050)లో ఓఆర్‌ఆర్ దాకా పట్టణ ప్రాంతంగా, ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆ ర్ వరకూ సబర్బన్ ప్రాంతంగా, ఆర్‌ఆర్‌ఆర్‌కు వెలుపల గ్రామీణ ప్రాంతంగా మూడు భాగాలుగా రాష్ట్రం విభజన కానుంది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగానే అభివృద్ధి కార్యక్రమాలను చేప ట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే హెచ్‌ఎండీఏ పరిధి ప్రస్తు తం ఉన్న 7,285 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి కొత్తగా మరో 5 వేల చదరపు కిలోమీటర్ల పరిధి పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం హెచ్‌ఎండీఏ పరి ధి 12 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కానుంది.

ప్రస్తుతం హెచ్‌ఎండీఏ 7 జిల్లాల పరిధిలో ఉండగా, రీజినల్ రింగ్‌రోడ్డు విస్తరణతో మరో రెండు లేదా మూడు జిల్లాలు చేర్చే అవకాశం అవకా శం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త గా తయారుచేస్తున్న 2050 మాస్టర్ ప్లాన్‌లో 111జీవోకు సంబంధించిన విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుం టారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 

నిర్మాణ రంగానికి బూస్ట్..

రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న 2050 మాస్టర్ ప్లాన్‌లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రధాన అజెండా కానున్న నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కొన్నేళ్ల పాటు కొనసాగను న్న నేపథ్యంలో ఇప్పటివరకూ స్తబ్థుగా ఉన్న నిర్మాణం రంగానికి ఒక్కసారిగా రెక్కలు రానున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగిసిన దాదాపు 120 మున్సిపాలిటీలకు ప్రభు త్వం తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా.. ప్రత్యేక అధికారులను నియమించడం కూడా 2050 మాస్టర్‌ప్లాన్‌లో భాగమే కావొచ్చంటూ భావిస్తున్నారు.

అయితే నిర్మాణరంగ సం స్థల ప్రతినిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వం త్రిపుల్‌ఆర్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రారంభిస్తుందా అని నిరీక్షిస్తున్నారు. ఒక వేళ త్రిపుల్‌ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభంకాగానే రియల్ రంగం మరింత పుంజుకునే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు భావిస్తున్నారు.