23-03-2025 12:02:28 AM
ఏర్పాటుతో కొత్త నగరంపై రియల్ రంగం కోటి ఆశలు పెంచుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఫ్యూచర్ సిటీ నగరంలో రియల్ రంగానికి ఊతమందించే దిశగా సాగుతోంది. ఎఫ్‌డీసీఏ ఏర్పాటుతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చేందుకు అవకాశం లభించనుంది. ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్‌ఆర్ ప్రాజెక్టులతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో భారీ ప్రాజెక్టులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో భూములు, ఇండ్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, అందుకే త్వరపడిన వారికి చక్కని అవకాశాలు ఉంటాయని మర్కెట్ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాం తి): అభివృద్ధికి చిరునామాగా మారిన హైదరాబాద్ నగరాన్ని మరింత కొత్తపుంతలు తొక్కించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఫ్యూచర్ సిటీ నగ రంలో రియల్ రంగానికి ఊతమందించే దిశగా సాగుతోంది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఇటీవల కాలంతో కాస్త దెబ్బతిన్న రియల్ రంగానికి ప్రోత్సాహకరంగా మారిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవే, సాగర్ మార్గాల్లోని మహేశ్వరం, ఆమనగల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకు ంది. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆమనగల్లులో 2 గ్రామాలు, మహేశ్వరం నుంచి 2, మంచాల నుంచి 3, ఇబ్రహీంపట్నంలో 8, కడ్తాల్ పరిధిలోని 6, యాచారం నుంచి 17, కందుకూరు నుంచి 18 గ్రామాలు ఇకపై ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎఫ్‌డీసీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా, మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
కొత్త నగరంపై కోటి ఆశలు..
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌డీసీఏ) ఏర్పాటుతో కొత్త నగ రంపై రియల్ రంగం కోటి ఆశలు పెం చుకుంది. ఇప్పటికే శ్రీశైలం, సాగర్ హైవే లో రియల్ ఎస్టేట్ రంగం భారీగానే విస్తరించింది. అయితే ఎఫ్‌డీసీఏ ఏర్పాటు తో మరిన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చేందుకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం నగరంలో భూముల ధరలు కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో నగర శివారు ప్రాంతాల్లో భూములపై పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
భవిష్యత్తులో బాగా డిమాండ్ ఉండే ఏరియాల్లో పెట్టుబడులు పెడితే బాగుంటుందని భావించే వారంతా ఇప్పుడు ఎఫ్‌డీసీఏ పరిధిలోని ప్రాంతా ల్లో భూములు, స్థలాలను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రస్తు తం రియల్ ఎస్టేట్ రంగం కాస్త నెమ్మదించిన నేపథ్యంలో ఎఫ్‌డీసీఏ పరిధిలో భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో వాటిని మరింత ఆకర్షణీయమైన ధరలకు విక్రయించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నా రు.
ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్‌ఆర్ ప్రాజెక్టులతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో భారీ ప్రాజెక్టులు ప్రారంభమవుతున్న నేపథ్యం లో భూములు, ఇండ్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, అందుకే త్వరపడిన వారికి చక్కని అవకాశాలు ఉంటా యని మర్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ ఎకోసిస్టమ్ విస్తరణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కొన్ని నెలలుగా ప్రభుత్వ యం త్రాంగం విధాన నిర్ణయాలు తీసుకోవడంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. నగరంలో ఉపాధి అవకాశాలు బాగా పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మరింత పుంజుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ సిటీ రూపం లో రియల్ రంగానికి కొత్త ఫ్యూచర్ ఉంటుందని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు.