వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ, సామాన్యులను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలపై ప్రభుత్వం, కోర్టులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒక్క జంటనగరాలలోనే రియల్ ఎస్టేట్ మోసాలు ఒక అంచనా ప్రకారం రూ.10 వేల కోట్లు వుంటుందని ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలలో మధ్యతరగతి వారినే ఎక్కువగా టార్గెట్ చేసుకొని కొన్ని నకిలీ రియల్ సంస్థలు మోసాలకు పాల్పడుతుండటం బాధాకరం.
డి.సాయితేజ, రాయదుర్గం