calender_icon.png 3 April, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాతో కుప్పకూలిన రియల్ ఎస్టేట్

25-03-2025 12:32:32 AM

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. హైడ్రాతో ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయన్నారు. అలాగే, హెచ్‌సీయూకు చెందిన 400 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయడం వల్ల అక్కడ రెం డు చెరువులు కనుమరుగయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

సోమవారం అసెంబ్లీ లో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలకు విదేశీ స్కా లర్‌షిప్‌లు, ఇతర స్కాలర్‌షిప్ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడంలో తప్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. బంగ్లాల్లో నివ సిస్తున్న వారు, కార్లు ఉన్న వారు సైతం స్కా లర్‌షిప్ పథకాలను పొందుతున్నారని ఆరోపించారు. అలాగే, రాష్ర్ట ప్రభుత్వం మైనారిటీ, బీసీ సబ్-ప్లాన్‌లను అమలు చేయాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.