calender_icon.png 15 November, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మాసిటీ పేరుతో రియల్ దందా

12-11-2024 12:00:00 AM

సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ఫార్మా సిటీ పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు రేవంత్ మీద ఉన్న కోపం వికారాబాద్ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపారని.. పేర్కొన్నారు.

వికారాబాద్‌లోని పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారని.. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందన్నారు. ఫార్మసిటీ కోసం సేకరించిన భూమిని రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందన్నారు. ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి సారించి పచ్చటి పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హరీశ్ సూచించారు.