calender_icon.png 17 November, 2024 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ సుందరీకరణ పేరుతో రియల్ దందా

17-11-2024 01:36:46 AM

  1. బుల్డోజర్‌కు అడ్డమొస్తే తొక్కేయమని సీఎం ఆదేశించారు
  2. అందుకే మూసీ పేదలకు ధైర్యం చెప్తున్నాం 
  3. బీజేపీ మూసీ బస్తీనిద్రలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  4. 20 బస్తీల్లో బీజేపీ నేతల మూసీ బస్తీనిద్ర

హైదరాబాద్ సిటీబ్యూరో/ మలక్‌పేట్/ ఎల్బీనగర్/ రాజేంద్రనగర్, నవంబర్ 16 (విజయక్రాంతి): మూసీ సుందరీకరణ పేరుతో రియల్ వ్యాపారానికి సీఎం రేవంత్ తెరలేపారని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శిం చారు. లక్ష బుల్డోజర్లు వచ్చినా ఒక్క ఇంటిని కూల్చలేరన్నారు.

ఇండ్ల కూల్చివేతను సీఎం రేవంత్ రెడ్డి పునఃపరిశీలించాని కేంద్రమంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మనవి చేస్తున్నానన్నారు. బీజేపీ మూసీ బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కిషన్‌రెడ్డి అంబర్‌పేట తులసీరాంనగర్‌బస్తీలో రచ్చబండలో పాల్గొని బస చేశారు. అనంతరం అంబోజి శంకరమ్మ నివాసంలో భోజ నం చేసి నిద్రించారు.

రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ శాలివాహన నగర్‌లో స్థానిక మూసీ బాధితులతో కలిసి బస్తీలో పర్యటించారు. మూసీ బాధితుడు జంగయ్యగౌడ్ నివాసంలో భోజనం చేసి నిద్రించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎల్‌బీనగర్ ఫణిగిరి కాలనీలో నిద్రించారు.

పర్యటనలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్‌రావు, సీనియర్ నాయకురాలు రాణిరుద్రమ దేవి తదితరులు పాల్గొన్నారు. తులసీరాంనగర్ బస్తీలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలేగానీ, రేవంత్‌రెడ్డి మాత్రం ఉన్నవాటినే కూలగొడుతున్నారని ఎద్దేవా చేశారు.

పేదల ఇండ్లను కూలగొట్టాలనే దుర్మార్గ ఆలోచనను మానుకోవాలన్నారు. సీఎం ప్రకటనలతో మూసీ పరీవాహక ప్రజలు దినమొక గండంలా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సుం దరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని.. అవసరమైన మేరకే రిటైనింగ్ వాల్ కట్టాలన్నారు. మూసీ బ్యూటిఫికేషన్‌కు లక్షా యాబై వేల కోట్లు సోనియా ఇస్తుందా.. లేక రాహుల్ గాంధీ ఇస్తరా అని ప్రశ్నించారు. 

సీఎంనైనా మారుస్తాం.. ఇళ్లు వదిలి వెళ్లం

సీఎంనైనా మారుస్తాం కానీ ఇండ్లను వదిలివెళ్లే ప్రసక్తి లేదని మూసీ పరీవాహక  ప్రజలు తేల్చి చెప్పారు. ‘హైదరాబాద్‌లో ఇల్లు లేనివాళ్లు చాలామంది డబుల్ ఇళ్లకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అవసరముంటే వాళ్లకు ఇవ్వండి. మాకు అల్రెడీ ఇళ్లు ఉన్నాయి. డబుల్ ఇళ్లు అవసరం లేదు’ అని అన్నారు. సీఎం రేవంత్ మా బస్తీలకొచ్చి ఒక్క రోజైనా ఉండాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. ఎన్ని బుల్డోజర్లొచ్చినా అడ్డుకుంటామని... చావడానికైనా సిద్ధమేగానీ, ఇళ్లను మాత్రం  కూల్చనివ్వమని తేల్చిచెప్పారు.  

రేవంత్‌ది తుగ్లక్ పాలన: ఈటల 

సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది పాలన తుగ్లక్ పాలనగా మారిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రాజేందర్ చైతన్యపురి డివిజన్‌లో బస్తీ నిద్రలో ఎంపీ ఈటల మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు ప్రశాంతతను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల ఇండ్లను కూల్చొద్దు: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

సీఎం రేవంత్ వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని మూసీ  పరివాహక ప్రాంతాల్లో నిద్రాదీక్ష చేస్తున్నట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్, హైదర్‌గూడ, హైదర్‌షాకోట్ ప్రాంతాల్లో మూసీ నిర్వాసితులకు భరోసా కల్పించడానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిద్ర దీక్ష చేస్తున్నారు. 

20 బస్తీలలో బీజేపీ ముఖ్య నేతలు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ, పునరుజ్జీవనం ప్రాజెక్టులో మూసీ పరివాహక ప్రజల ఇళ్లను కూల్చివేయద్దంటూ బీజేపీ నేతలు శనివారం రాత్రి మూసీ ప్రాంతంలోని బస్తీల్లో మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. 20 బస్తీల్లో 20 మంది ముఖ్యనేతలు స్థానికులతో రాత్రంతా బస చేశారు.

కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి అంబర్‌పేట తులసీరాంనగర్ బస్తీలో, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ఓల్డ్ మలక్‌పేటలో, ఎల్‌బీనగర్ ఫణిగిరి కాలనీ, గణేశ్‌నగర్, ద్వారకాపురం కాలనీలో మల్కాజిగిరి ఎంపీ ఈటల, రాజేంద్రనగర్ హైదర్‌షాకోట్‌లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్ జుమ్మేరాత్ బజార్‌లో, బీబీ పాటిల్ అఫ్జల్ గంజ్ బస్తీలో, మాజీ మంత్రి సీ కృష్ణాయాదవ్ అంబర్‌పేట అంబేద్కర్ నగర్‌లో, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ జియాగూడలో, చింతల రామచంద్రారెడ్డి కమలానగర్‌లో, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ రామాం తాపూర్‌లో, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు ఘట్‌కేసర్‌లో, పార్టీ సీనియర్ నేతలు డీ ప్రదీప్ కుమార్ లంగర్‌హౌజ్‌లో, కార్వాన్‌లో ప్రేమ్‌సింగ్ రాథోడ్, అసద్‌బాబా నగర్‌లో ధర్మారావు, గౌలిగూడలో కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పురానాఫూల్ దర్వాజలో అమర్‌సింగ్, శాస్త్రీనగర్‌లో కేఎస్ రత్నం, హైదర్‌గూడలో జనార్ధన్‌రెడ్డి, అత్తాపూర్‌లో ప్రేమేందర్ రెడ్డి, న్యూ మారుతీ నగర్, సత్యానగర్‌లో చాడ సురేశ్ రెడ్డి రాత్రి నిద్ర చేశారు.

మూసీపై విపక్షాలవి డ్రామాలు

ఎమ్మెల్యే కుంభం అనిల్‌రెడ్డి 

హైదరాబాద్ (విజయక్రాంతి): మూసీ లో మూడు నెలలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరితే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు ఒక్కరోజు మూసీ నిద్ర దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కిషన్‌రెడ్డి మా ఛాలెంజ్ ఒకరోజు కాదు.. మూడు నెలలు మూసీలో ఉండాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.

దశాబ్దాలుగా మూసీ కాలు ష్యం వల్ల అన్నివర్గాల ప్రజ లు ఇబ్బందులు పడుతుతన్నారని, మూసీ సమస్య ను రాజకీయం చేయవద్దని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి హితవు పలికారు. ఢిల్లీలో బీఆర్‌ఎస్, బీజేపీ దోస్తీ అని అందరికీ తెలుసని, గల్లీలో మాత్రం కుస్తీ పట్టినట్లుగా నటిస్తున్నారని ఆయన ఆరోపిం చారు. ఇప్పటికైనా మూసీ ప్రక్షాళనపై అనవసర డ్రామాలు మానుకోవా లని అనిల్‌కుమార్‌రెడ్డి హితవు పలికారు.