calender_icon.png 11 January, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాముడి చుట్టూ రియల్ దందా!

11-07-2024 02:45:54 AM

  1. అయోధ్య రామాలయం చుట్టూ వాలిన నేతలు
  2. గుడికి 15 కిలోమీటర్ల దూరంలో అంతా వాళ్లే
  3. ఎకరాలకు ఎకరాల భూములు కొనుగోలు
  4. రాజకీయ నేతలతో పోటీ పడిన ఐఏఎస్, ఐపీఎస్‌లు
  5. 25 గ్రామాల్లో కీలక భూములన్నీ కొనుగోలు
  6. భూముల రేట్లు పెంచేందుకు యూపీ సర్కారు నో
  7. ఇప్పుడు కోట్లు పలుకుతున్న జాగాలు

అయోధ్య, జూలై ౧౦: అయోధ్యలో రామమందిరం నిర్మాణం, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో దేశంలోని హిందువులంతా పులకించారు. ఈ కార్యక్రమాలు దగ్గరుండి జరి పించిన ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను వేనోళ్ల పొగిడారు. ఏకంగా బాలరాముడిని చెయ్యిపట్టుకొని ప్రధాని మోదీ అయోధ్య రామా లయానికి తీసుకెళ్తున్నట్టు చిత్రాలు కూడా రూపొందించి ప్రచారం చేశారు.

ఇటీవలే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ ఆలయాన్ని బాగానే ప్రచారం చేసుకొన్నది. ఇదంతా పక్కన పెడితే.. అయోధ్య రామాలయం చుట్టూ ఎవరికీ తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా మరో దం దా నడిచింది. అదే రియల్ ఎస్టేట్ దందా. యూపీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు పోటీపడి ఆలయం సమీపంలో భూ ములు కొనుగోలు చేశారు. వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టు ౨౦౧౯లో తీర్పు ఇచ్చిన మరుక్షణం వీరంతా రంగంలోకి దిగారు.

ఇదంతా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా సంస్థ నిర్వహించిన అధ్యయ నంలో తేలింది. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని అయోధ్యలో ౨౦౧౯ లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భూమి రిజిస్ట్రేషన్లు అమాం తం పెరిగాయి. అయోధ్య పట్టణం చుట్టూ ఉన్న 25 గ్రామాల్లో రియల్ భూమ్ పురులు విప్పింది. ఆలయం చుట్టూ గోండా, బస్తీ జిల్లాల్లోని 15 చదరపు కిలోమీటర్ల దూరం ఈ కొనుగోళ్లు జరుగటం గమనార్హం. అయోధ్య చుట్టూ భూములు కొన్న కీలక నేతలు, అధికారుల్లో కొందరు.

1) అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్, అతని కుమారుడు చౌనా కాన్ సెంగ్ మెయిన్ 2022 నుంచి 2023 మధ్యలో గోండా జిల్లాలోని మహేశ్‌పూర్‌లో 3.99 హెక్టార్ల భూమిని రూ.372 కోట్లకు కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో ఉన్నది.  ఇది అయోధ్యను గోండా జిల్లా ను విడదీసే సరయూ నది ఒడ్డున్న ఉన్నది.  

2) బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్, అతని కొడుకు కరణ్ భూషణ్ తన సొంత కంపెనీ నందిని ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ద్వా రా మహేశ్‌పూర్‌లో 0.97 హెక్టార్ల భూ మి కొన్నారు. దేవాలయానికి ఇది కేవలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ భూ మిని 2023లో రూ.1.15 కోట్లకు కొనుగోలు చేశారు.  

3) యూపీ ఎస్టీఎఫ్ చీఫ్, అదనపు డీపీజీ అమితాబ్ యశ్  తన తల్లి గీతాసింగ్ పేరుమీద మహేశ్‌పూర్, దుర్గాగంజ్, యదువంశ్ పూర్‌లో 9.955 హెక్టార్ల భూమిని 2022 ఫిబ్రవరి, 2024 మధ్య కాలంలో రూ. 4.04 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది ఆలయానికి 8.-13 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది.  

4) యూపీ హోం సెక్రటరీ సంజయ్ గుప్తా అతని సతీమణి డాక్టర్  చేతనా గుప్తా కలి సి బన్వీర్‌పూర్‌లో 253చదరపు మీటర్ల  నివాస స్థలాన్ని ౨౦౨౨ ఆగస్టు ౫న కొనుగోలు చేశారు. ఇది ఆలయానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే ఆ జభూమిని అమ్మేశామని సంజయ్‌గు ప్త తెలిపారు. 

5) యూపీ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ అర్వింద్‌కుమార్ ఆయన సతీమణి మమత ౨౦౨౩ ఆగస్టులో ఆలయానికి ౭ కిలోమీటర్ల దూరంలోని షానవాజ్ పూర్ 1,051 చదరపు మీటర్ల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. 

6) రైల్వే డిఫ్యూటీ చీఫ్ ఇంజినీర్ మహాబల్ ప్రసాద్  కొడుకు అన్షునల్ మరో వ్యక్తితో కలిసి షానవాజ్‌పూర్ మాఝా లో ౨౦౨౩ నవంబర్‌లో 0.304 హెక్టార్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. 

7) అలీగర్ అదనపు ఎస్పీ పలాష్ బన్సాల్ తన తండ్రి దేశ్‌రాజ్ బన్సల్ పేరుపై ౨౦౨౧లో ఆలయానికి ౧౫ కిలోమీటర్ల దూ రంలోని రాజేపూర్ ఉపర్‌హర్‌లో 1781. 03 చదరపు మీటర్ల స్థలాన్ని రూ.౬౭.౬౮ లక్షలకు కొనుగోలు చేశారు.  

8) అమేథీ ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ అత్తమామలు ఉమ్మడిగా దుర్గాగంజ్ లో 4 హెక్టార్ల వ్యవసాయ భూమి కొన్నారు. 

9) యూపీ మాజీ డీజీపీ యష్‌పాల్ సింగ్ ఆలయానికి ౧౪ కిలోమీటర్ల దూరంలోని బన్వీర్‌పూర్‌లో ౨౦౨౦ మధ్య 0.427 హెక్టార్ల వ్యవసాయ భూమి, 132.7137 చదరపు గజాల నివాస స్థలాన్ని కొనుగోలు చేశారు. 

10) నార్త్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అనురాగ్ త్రిపాఠి తండ్రి మదన్ మోహన్ త్రిపాఠి పేరుపై ౨౦౧౭ మధ్య అయోధ్య ఆలయానికి ౧౫ కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్ సరాయ్‌లో 1.57 హెక్టార్ల వ్యవసాయ భూమి ని, 640 చదరపు గజాల నివాస భూమి ని కొనుగోలు చేశారు. 

11) హర్యానా యోగ్ ఆయోగ్ చైర్మన్ జైదీప్ ఆర్య మరో నలుగురితో కలిసి మాఝా జమ్‌తారాలో 3.035 హెక్టర్ల భూమిని కొనుగోలు చేశారు. ఈయన బాబా రామ్‌దేవ్ మాజీ సహచరుడు. 

12) యూపీ బీజేపీ ఎమ్మెల్యే అజయ్ సింగ్ సోదరుడు కృష్ణకుమార్ సింగ్, అతని మేనల్లుడు సిద్ధార్థ మాహేశ్‌పూర్‌లో 0.4 55 హెక్టార్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. 

13) గోసాయిగంజ్ నగర పంచాయతీ చైర్‌పర్సన్ విజయ్ లక్ష్మీ జైస్వాల్ (బీజేపీ) బం ధువు మదన్ జైశ్వాల్ అయోధ్యకు ౭ నుంచి ౧౨ కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలుగు గ్రామాల్లో రూ.౧.౩ కోట్లతో 8. 71 హెక్టార్ల వ్యవసాయభూమిని కొనుగో లు చేశారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు  రాంపూర్ హల్వారా మా ఝాలో 3.38 హెక్టార్ల భూమిని కొన్నారు.  

14) బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర కుమార్ అతని సోదరుడు వినోద్‌సింగ్ 0.272 హెక్టార్లు వ్యవసాయ భూమి, 370 చదరపు మీటర్ల ఇంటి స్థలాన్ని  కొనుగోలు చేశారు.

15) బీజేపీ మాజీ ఎమ్మెల్యే చంద్ర ప్రకాష్ శుక్లా జమ్‌తారా మాఝాలో 1.34 హె క్టార్ల  వ్యవసాయ భూమి, 1,985.6 చదరపు గజాల నివాస భూమిని కొన్నారు. 

16) ఎస్పీ మాజీ ఎమ్మెల్సీ రాకేశ్‌రాణా, అతని కుమారుడు రిషబ్  దుర్గాగంజ్‌లో 0.4 2 హెక్టార్లు కొనుగోలు చేశారు. 

అదానీ నుంచి లోధాస్ వరకు

రాజకీయ నేతలు, అధికారులే కాదు.. అనేకమంది పారిశ్రామికవేత్తలు కూడా అయోధ్య చుట్టుపక్కల ఎకరాలకు ఎకరాలు వ్యవసాయ భూములతోపాటు రెసిడెన్షియల్ ప్లాట్లు ముందుగానే కొనిపెట్టుకొన్నా రు. ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ హోబల్ జూన్ 2023 నుంచి 2024 మార్చి వరకు 25.27 హెక్టార్ల వ్యవసాయ భూమి, తిహురా మఝాలొ 12,693 చదరపు గజాల  నివాస భూమిని కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో ఉంది. హోబయ్ యాజమాని అభినందన్ మంగళ్ ప్రభాత్ లోధా. ఆయన కుమారుడు మంగళ్ ప్రభాత్ లోధా మహారాష్ట్రలో మంత్రి. అదానీ గ్రూప్ ౨౦౨౩ సెప్టెంబర్ 18న మఝా జమ్తారాలో 1.4 హెక్టార్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. బెంగళూరుకు చెందిన వ్యక్తి వికాస్ కేంద్రం మఝా జమ్‌తారాలో 5.31 హెక్టార్ల కంటే ఎక్కువ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది.

విలువ పెంచకుండా ప్రభుత్వం కుట్ర : రైతులు 

అయోధ్యలో రామాలయం కడుతున్నారని తెలియగానే ఆ చుట్టుపక్కల ౨౦ కిలోమీటర్ల పరిధిలో భూముల విలువ అమాంతం పెరిగింది. ఆలయం చుట్టూ టూరిజం అభి వృద్ధి చెందుతుందన్న ముందస్తు ఆలోచనతో ఎంతోమంది అక్కడ ముందుగానే భూ ములు కొనేందుకు ఎగబడ్డారు. అయితే, ఈ ప్రాంతంలో యూపీ ప్రభుత్వం భూముల ధరలు సవరించేందుకు మాత్రం ఒప్పుకొలేదు. చివరిసారి ౨౦౧౭లో ఇక్కడి భూముల ధరలను ప్రభుత్వం సవరించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగినందున భూములకు మార్కెట్ విలువ పెరిగిందని, అందువల్ల ప్రభుత్వ రేట్లు సవరించాలని రైతులు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కొందరు రైతులు కోర్టుకు కూడా వెళ్లారు. అయి నా భూముల ధరలు సవరించేందుకు ప్రభుత్వం నిరాకరించింది.