calender_icon.png 18 April, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డగోలుగా తిరుగుతున్న రెడీమిక్స్ ట్యాంకర్లు

27-03-2025 12:32:56 AM

 దృష్టి సారించని ట్రాఫిక్ పోలీసులు  

 రాజేంద్రనగర్, మార్చి 26 (విజయ క్రాంతి): నార్సింగి, మణికొండ మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రెడీమిక్స్ ట్యాంకర్లు అడ్డగోలుగా తిరగడంతో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడీమిక్స్ ట్యాంకర్లతో పాటు భారీ వాహనాలు నిర్ణీత సమయాల్లో మాత్రమే తిరగాల్సి ఉండగా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు సూచించిన సమయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా నడుపుతుండటంతో వివిధ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్  ఏర్పడుతున్నాయి.

మణికొండ మున్సిపల్ పరిధిలోని ఆల్కపూరి కాలనీలో భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో వేలాపాల లేకుండా రెడీమిక్స్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కఠిన చర్యలు తీసుకోవాల్సిన ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.