11-12-2024 12:38:10 AM
తుర్క్‌మెనిస్థాన్ ఎంబసీ కాన్సుల్ శముహమ్మత్ మహమ్మదోవ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10(విజయక్రాంతి): ఓయూతో కలిసి పనిచేసేందుకు తమ విద్యా శాఖ సిద్ధంగా ఉందని తుర్క్‌మెనిస్థాన్ ఎంబసీ కాన్సుల్ శముహమ్మత్ మహమ్మదోవ్ అన్నారు. మంగళవారం తుర్క్‌మెనిస్థాన్ బృందం అధికారులు ఓయూను సందర్శించి వీసీ ప్రొ. కుమార్ మొలుగారంతో భేటీ అయ్యా రు.
ఓయూలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలిసి పనిచేసే అవకాశాలపై వీసీతో చర్చించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొ. కుమార్ మాట్లాడుతూ.. యూరప్ మినహా 46దేశాల విద్యార్థులు ఓయూలో విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు.
విదేశీ విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటామని తెలిపారు. శముహమ్మత్ మహమ్మదోవ్ మాట్లాడు తూ.. ఓయూతో కలిసి పనిచేసే విషయాన్ని తమ దేశ విద్యాశాఖ మంత్రితో సమావేశమై త్వరలోనే చర్చించి, పరస్పర అవగాహన కుదుర్చుకుంటామని తెలిపారు.
కార్యక్ర మంలో తుర్క్‌మెనిస్థాన్ ఎంబసీ సెకండ్ సెక్రటరీ ఇస్కెందర్ అతలియేవ్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.గడ్డం నరేష్‌రెడ్డి, ఓఎస్‌డీ ప్రొ.జితేందర్‌నాయక్, ఇంటర్నేషనల్ అఫైర్స్ సం చాలకులు ప్రొ.విజయ, ఓఐఏ మాజీ డైరెక్టర్ ప్రొ.శివరామకృష్ణ, జాయింట్ డైరెక్టర్ ప్రొ. పీసరితారెడ్డి, ప్రొ.శ్రీలత, ప్రొ. ప్యాట్రిన్ పాల్గొన్నారు.