03-04-2025 01:13:11 AM
వాషింగ్టన్, ఏప్రిల్ 2: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుకు సర్వం సిద్ధం అయింది. భారత్, జపాన్‌లు అమెరికా మీద అధిక మొ త్తంలో సుంకాలు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 2 సాయంత్రం 4 గంట ల (అమెరికా కాలమానం ప్రకా రం) నుంచి కొత్త సుంకాలు అమలు కానున్నాయి.
ఏప్రిల్ 2ను ‘లిబరేషన్ డే’గా ట్రంప్ అభివర్ణించారు. ప్రతీకార సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ ప్రకటించిన విషయం తెలి సిందే. అగ్రరాజ్యం దిగుమతి చేసుకునే చాలా రకాల వస్తువుల మీద 20 శాతం పన్ను విధించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది.
ఈ సుంకా ల విధింపు ద్వారా అమెరికాకు ఏటా 600 700 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్టు తెలుస్తోంది. ఈ పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకే తిరిగి ఇవ్వాలని ట్రంప్ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం.
వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు
ప్రతీకార సుంకాల అమలు వేళ వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, యూరోపియన్ యూనియన్, జపాన్, కెనడా దేశాలు అగ్రరాజ్యం మీద పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తున్నారని మండిపడింది. భారత్‌కు చెందిన 9.6 బిలియన్ అమెరికన్ డాలర్ల వస్త్ర ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు ప్రభావం చూపెట్టనున్నట్లు తెలుస్తోంది.తెలిసిందే.
వెనకడుగు వేసిన ఇజ్రాయెల్
లిబరేషన్ డేకు ముందే ఇజ్రాయెల్ అమెరికా మీద సుంకాలను ఎత్తేస్తూ నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల ఉత్పత్తులపై నేటి నుంచి అన్ని రకాల సుంకాలను రద్దు చేస్తున్నాం. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది’ అని తెలిపారు.
ఆ దేశాలు ‘డర్టీ 15’
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. కొన్ని దేశాలను డర్టీ 15 దేశాలుగా అభివర్ణించారు. ‘15 శాతం అమెరికా వాణిజ్య భాగస్వాములు అమెరికా మీద అధిక పన్నులు విధిస్తున్నారు. అయితే ఈ దేశాలేవనేది ఆయన ఖచ్చితంగా వెల్లడించలేదు. కానీ అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్ 2024లో రిలీజ్ చేసిన వాణిజ్య లోటు లెక్కల ఆధారంగా అమెరికాతో అత్యధిక వాణిజ్యలోటు ఉన్న మొదటి 15 దేశాలు ఇవే..
1) చైనా, 2) ఈయూ, 3) మెక్సికో, 4) వియత్నాం, 5) జర్మనీ, 6) తైవాన్, 7) జపాన్, 8) కెనడా, 9) సౌత్ కొరియా, 10) భారత్, 11) ఇటలీ, 12) థాయిలాండ్, 13) మలేషియా, 14) ఇండోనేషియా, 15) స్విట్జర్లాండ్.