నాపై కేసు పెడతారా?
జైలుకెళ్లేందుకైనా నేను సిద్ధమే:
జైల్లో పెడితే యోగా చేసి.. పాదయాత్రకు సిద్ధపడతా
హైదరాబాద్: విత్తనం మొక్క కావడానికి దశాబ్దాలు పట్టొచ్చు.. లక్షల కోట్ల పెట్టబడులు తెచ్చినందుకు నాపైనే కేసు పెడతారా..? అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. జైలుకెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. జైల్లో పెడితే యోగా చేసి.. పాదయాత్రకు సిద్ధపడతానని హెచ్చరించారు. రాజ్ భవన్ లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ ను ఖతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. విచారణకు అనుమతి ఇవ్వడం గవర్నర్ విచక్షణ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడితే ఎదురొంటానని కేటీఆర్ తెలిపారు.