calender_icon.png 27 February, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సపోర్టింగ్ రోల్స్ చేయడానికైనా రెడీ

27-02-2025 12:00:00 AM

‘నేనెక్కడున్నా’ సినిమాతో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం అవుతు న్నారు. ఎయిర్‌టెల్ ఫేమ్ సషా చెత్రి హీరోయిన్. మాధవ్ కోదాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మారుతి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానున్న సందర్భంగా మిమో చక్రవర్తి పంచుకున్న చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘తెలుగు సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యారు.

ఆర్టిస్టులకు, హీరో హీరోయిన్లకు భాష అనేది అడ్డు కాదు. కాకూడదు. ఇవాళ నేను తెలుగు సినిమా చేశా. రేపు ఆవకాశం వస్తే ఇతర భాషల సినిమాలు కూడా చేస్తా. నాకు తెలుగు సినిమాలో అవకాశం రావడం పట్ల నాన్న సంతోషం వ్యక్తం చేశారు. భాష రాదని అసలు ఆలోచించవద్దని చెప్పారు. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఇందులో మెసేజ్ ఉంది. ఇదొక కంప్లీట్ పాప్ కార్న్ ఎంటర్‌టైనర్. పాటలు, మంచి యాక్షన్  సన్నివేశాలు ఉన్నాయి. మహిళా జర్నలిస్టులు తమ కాళ్ల మీద ఎందుకు నిలబడలేరనే చక్కటి సందేశాన్నిస్తుంది.

ఇందు లో విలన్‌గా అవకాశం వచ్చినా తప్పకుండా చేసేవాన్ని. విలన్ క్యారెక్టర్స్ కోసం ఎదురుచూస్తున్నా. విలన్ పాత్రలకు నేను పర్ఫెక్ట్ ఫిట్ అనుకుంటున్నా. నటుడిగా నన్ను నేను పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు. మంచి క్యారెక్టర్లు వస్తే కమెడియన్, సపోర్టింగ్ రోల్స్‌కైనా రెడీ. మాధవ్  ముందు షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఇది ఆయన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. దీనికోసం ఎంతో కష్టపడ్డారు. ఆయనకు నిర్మాత కేబీఆర్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. ‘గోపాలా గోపాలా’ చిత్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దేవుడి పాత్ర చేశారు.

అందులో నాన్న నటించారు. ఒరిజినల్, రీమేక్... రెండు సినిమాలు చూశా. ప్రజెంట్ ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్నారు. ఫాదర్ అండ్ సన్ కంటే స్నేహితులుగా ఉంటాం. పవన్ కళ్యాణ్, ప్రభాస్, దళపతి విజయ్, రజనీకాంత్ అంటే ఇష్టం. మిగతా స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేయాలనుంది. విక్రమ్ భట్ దర్శకత్వం లో ౧౩ ఏళ్ల క్రితం చేసిన హిట్ ఫిల్మ్ ‘హాంటెడ్’ సీక్వెల్ చేస్తున్నా. నెట్‌ఫ్లిక్స్ కోసం ‘ఖాకి’ వెబ్ సిరీస్ సీజన్ 2 చేస్తున్నా” అని తెలిపారు.