calender_icon.png 22 February, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధమే.. టైమ్ చెప్పండి!

22-02-2025 01:01:42 AM

  1. 14 నెలల మీ పాలనపై.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై చర్చకు రెడీ 
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): ‘రాష్ట్రంలో 14 నెలల మీ పాలనపై చర్చకు సిద్ధమా ? పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై మేమూ సిద్ధం. ఏరోజు.. వేదిక ఎక్కడో మీరే చెప్పండి’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.

సీఎం ఇకనైనా కళ్లు తెరిచి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై నిందలు వేయ డం మాని, నదీ జలాల్లో తెలంగాణ ప్రయో జనాలు కాపాడాలని హితవు పలికారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిం ది కేసీఆరేనని గుర్తుచేశారు. ఏపీ కృష్ణా జలాలలను తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఆపడం చేతకావడం లేదని ధ్వజమెత్తారు.

పాలమూరును దత్తత తీ సుకున్నానని చంద్రబాబు గొప్పలు చెబుతూనే, నాడు ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని మ ళ్లించారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డికి నీటి విలువ, నోటి విలువ రెండూ తెలియదనిఎద్దేవా చేశారు. సీఎంకు తెలిసిందంతా అవినీతి నోట్ల విలువ మాత్రమేనన్నారు.

పాలమూరు  ఎత్తిపోతలకు అడ్డుపడుతూ నాడు కేసులు వే యించిన ఘునుడు రేవంత్‌రెడ్డే మం డిపడ్డారు కాంగ్రెస్ నేతలు వేసిన కేసులను ఎదుర్కొంటూనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం 90శాతం పనులు పూర్తి చేసిందని కొనియాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 10శాతం పను లు చేయకుండా పాలమూరు రైతు ల ఉసురు పోసుకుంటున్నదని ని ప్పులు చెరిగారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే కొడంగల్, నారా యణపేట నియోజకవర్గాలకు సైతం జలాలు తరలివస్తాయన్నారు. ఎకరాకైనా నీరివ్వని సీఎంకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.