calender_icon.png 7 January, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముషీరాబాద్‌లో రెడీ మిక్స్ కంటైనర్ బీభత్సం

31-12-2024 02:03:36 AM

ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ముషీరాబాద్ చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున ఓ రెడీ మిక్స్ కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. ముషీరాబాద్ చౌరస్తాలో ఓ డీసీఎం వాహనం టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కాంక్రీట్ మిక్చర్ లారీ డీసీఎం వాహనం, స్కూటీతో పాటు మరో వాహనాన్ని ఢీ కొంది. ఈ క్రమంలో ముషీరాబాద్ పోలీసుల వాహనాల తనిఖీలో భాగంగా చౌరస్తాలో ఆగి ఉన్న పోలీస్ వాహనంతో పాటు మరికొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ యూసుఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.