calender_icon.png 16 January, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1౩వ చిత్రానికి సిద్ధం

07-08-2024 12:05:00 AM

విశ్వక్ సేన్ తన 13వ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఇటీవల ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందు కున్న చిత్రం ‘దసరా’ను రూపొందించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ సంస్థ ఈ తాజా చిత్రాన్ని నిర్మించను న్నారు. నూతన దర్శకుడు శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇంకా రివీల్ చేయని మేకర్స్.. ట్యాగ్‌లైన్ మాత్రం ‘ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్’ అని ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. విశ్వక్ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ‘తంగలాన్’ ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటో గ్రఫీని నిర్వహించనుండగా, ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చను న్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు మేకర్స్ తెలిపారు.