22-12-2024 01:08:33 AM
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రస్తుతం నిరంతరం రైతు లకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు లాగ్ బుక్కు ల్లో చూపిస్తే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
తమ ప్రభుత్వ హ యాంలో 19 గంటల పాటు నిరంతర విద్యుత్ ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే శ్వేతపత్రంలో పేర్కొన్నట్టు గుర్తు చేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక చర్చ పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
కేంద్ర ప్రభు త్వం తమ మెడ మీద కత్తిపెట్టినా మోటర్లకు మీటర్లు పెట్టలేదని, రూ.30 వేలకోట్ల రుణ పరిమితిని వదులుకున్నామని స్పష్టం చేశారు. కోమటిరెడ్డికి దమ్ముంటే రావాలని.. నల్లగొండలో ఏ గ్రామానికైనా పోయి నీళ్లు ఇచ్చింది ఎవరో అడుగుదామని సవాల్ విసిరారు.
పాలమూరులో సాగును పెంచిందే మేము..
పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను వదిలిపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ తెలిపారు. మంత్రి జూపల్లి వ్యాఖ్యలపై ఆయ న స్పందిస్తూ పాలమూరు వలసలను ఆపి, సాగును పెంచింది బీఅర్‌ఆస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు ఉచి తంగా ఇచ్చామని చెప్పారు.
భవిష్యత్తులో అధికారంలోకి వస్తే కూడా ఇలానే ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం, పాలమూ రు ప్రాజెక్టు, భక్తరామదాసు, సీతారామ ప్రా జెక్టులను చేపట్టి తెలంగాణను సస్యశ్యామ లం చేశామన్నారు. వరిపంటలో పదకొండో స్థానం నుంచి ప్రథమస్థానానికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌దేనన్నారు.