calender_icon.png 23 December, 2024 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు రుణమాఫీపై చర్చకు సిద్ధమా?

06-10-2024 01:51:34 AM

మాజీ మంత్రి హరీశ్‌రావుకు జగ్గారెడ్డి సవాల్  

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాం తి): రైతు రుణమాఫీపై చర్చించేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామంటున్న హరీశ్‌రావు.. ముందు కేసీఆర్‌ను ఒప్పించి చర్చకు తీసుకురావాలని సవాల్ విసిరారు.

ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొంటారన్నారు. శనివారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే రూ.18 వేల కోట్లను రైతు రుణమాఫీకి ఇచ్చినట్టు చెప్పారు. టెక్నికల్ సమస్యల తో రుణమాఫీ కానివారి రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామన్నారు.

గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా.. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి చేశామన్నా రు. దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబానికి రాహుల్‌గాంధీపై విమర్శలు చేసే హక్కు లేదని మం డిపడ్డారు. కేసీఆర్‌ది రైతు గుండె అయితే మల్లన్న సాగర్ రైతుల ను పోలీసులతో కొట్టించినప్పుడు, ఖమ్మం రైతులకు బేడీలు వేసినప్పుడు ఆ రైతు గుండెను ఫ్రిజ్‌లో పెట్టారా అని నిలదీశారు.