01-04-2025 02:16:16 AM
టెహ్రాన్, మార్చి 31: అణు ఒప్పందం వి షయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసి న హెచ్చరికలకు ఇరాన్ ధీటుగా బదులిచ్చిం ది. ఆదివారం అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘ఇరాన్ అణుఒప్పందంపై సంతకం చేయకపోతే ఆ దేశంపై బాంబులు వేసేందుకు కూడా అమెరికా వెనుకాడదు’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
ఈ హెచ్చరికలపై ఇరాన్ సు ప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఘాటు గా స్పందించారు. ‘వారు కనుక బాంబులేస్తే వారు తప్పకుండా ప్రతిఘటన ఎదుర్కొంటారు. ట్రంప్ హెచ్చరికలు దుర్మార్గం. అమె రికా ఏదైనా సైనిక చర్యకు దిగినా దానికి కూడా కౌంటర్ అటాక్ ఉంటుంది.’ అని పేర్కొన్నారు. ఈద్ ప్రసంగం సందర్భంగా ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.
క్షిపణులు సిద్ధం చేసిన ఇరాన్!
ట్రంప్ తాజా హెచ్చరికలతో ఇరాన్ దేశవ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద క్షిపణులను ఇరాన్ సిద్ధం చేస్తున్నట్టు ‘టెహ్రాన్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఏ దేశంపై అయినా దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించుకోనున్నట్టు ఇరాన్ తెలిపింది. ఆదివారం ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై సెకండరీ టారిఫ్స్‌తో దాడి చేస్తానని కూడా హెచ్చరించారు.