11-03-2025 12:50:51 AM
* అఖిలపక్ష సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లో ఉండికూడా రాలేదు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బాధపడుతారని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌కు అడ్డుపడుతున్నది బీజేపీ ఎంపీలు ఈటల, లక్ష్మణ్‌లే.. కేసీఆర్ ఓ చెల్లని రూపాయి, ఆయన గురించి మాట్లాడటం వృథా.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి) : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్‌రెడ్డి చర్చకు వస్తే.. తను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వస్తామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్టం నుంచి ఎన్ని పన్నులు కట్టాం, వాళ్లు ఎన్ని నిధులు ఇచ్చారో లెక్క తేలుద్దామని, ఒక వేళ కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చినట్లు నిరూపిస్తే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తామని సీఎం అన్నారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
రాష్ర్ట అభివృద్ధి కోసం 39 సార్లు కాదు.. 99 సార్లు ఢిల్లీకి వెళ్తామన్నారు. అవసరమైతే నిధుల కోసం ఢిల్లీతో దీక్ష చేయడానికి కూడా సిద్ధమేనని సీఎం వెల్లడించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ చేపట్టవద్దని ఓ వైపు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్షణ్ ఆందోళనలు చేస్తూ అడ్డుపడుతూ.. మళ్లీ వాళ్లే భూసేకరణ చేయట్లేదని విమర్శిస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. రింగ్ ఉంటేనే రింగ్ రోడ్డు అంటారు. సగం పూర్తిచేసిన వాటిని రింగ్ రోడ్డు ఎలా అంటారు? ప్రధాని మోదీ రీజినల్ రింగ్ రోడ్డు ఇస్తున్నాం అన్నారు. మరి ఆ రింగ్ రోడ్డు ఎక్కడ ఉంది? కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అఖిలపక్షాన్ని ఆహ్వానిస్తే బీజేపీ నాయకులు ఎందుకు డుమ్మా కొట్టారు? కేంద్ర మం త్రి మనోహర్ లాల్ కట్టర్ సమావేశానికి కిష న్ రెడ్డి ఎందుకు రాలేదు? మోదీ బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కి ఇచ్చారు..
తెలంగాణకు ఎం దుకు ఇవ్వలేదు? రేవంత్‌రెడ్డి వచ్చాకే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది’ అని రేవంత్‌రెడ్డి వివరించారు. అఖిలపక్ష సమావేశానికి పిలి స్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌లో ఉండికూడా రాలేదని, కేసీఆర్ బాధపడుతారని కేంద్రమంత్రి సహకరించడం లేదని సీ ఎం విమర్శించారు. హైదరాబాద్‌కు జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తోందని.. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటున్నది రాష్ర్ట బీజేపీ నేతలే అని మండిపడ్డారు. మూసీకి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతానన్నారు. సబర్మతి, య మునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదని సీఎం ప్రశ్నించారు.
కేసీఆర్ చెల్లని రూపాయి..
కేసీఆర్ చెల్లని రూపాయి అని, ఆయన గురించి మాట్లాడటం వృథా అని ముఖ్యమంత్రి అన్నారు. ‘కేసీఆర్ స్థాయికి కాం గ్రెస్‌లో ఎవరూ సరిపోరని.. వాళ్ల పిచ్చి మా టలు, పనికిమాలిన దూషణలు, కారుకూతలు వినడానికి కేసీఆర్ రావద్దనేది కొడు కుగా తన అభిప్రాయ’మని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం కౌంటర్ ఇచ్చారు.
‘కేసీఆర్‌ను బండకేసి కొట్టి ఓడించింది నేను.. పార్ల మెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సు న్నా చేసింది నేనే.. తండ్రి కొడుకులకు బలు పు తప్ప ఏమీ లేదు. అడ్డగోలుగా మాట్లాడటంలో కేసీఆర్‌కు మించిన వాళ్లు లేరు. ఫా మ్‌హౌస్‌లో కూర్చొని మందుకొట్టడం స్టేచ రా? డ్రగ్స్ పార్టీల్లో దొరికిన వారిని సమర్ధించడం కేటీఆర్ స్టెచరా? కేటిఆర్ అన్నట్లు ని జంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్‌కు లే దు.
కేటీఆర్ ఓ పిచ్చోడు.. ఏదేదో మాట్లాడతాడు. అతడు ఒక క్రిమినల్, అందుకే కేసు లకు భయపడరు. భయపడే వ్యక్తే అయితే నేరాలు చేయడు. అసెంబ్లీలో అధికారపక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తు న్నాం. ప్రతిపక్షం లేని రాజకీయాలు చేయాలని తాము అనుకోవడం లేదు. వాళ్ళు మూసేసిన ధర్నా చౌక్ మేం తెరిపించాం. విమర్శలు చేస్తే పరిశీలించుకుంటాం.
సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాం’ అని సీ ఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘జీతభత్యాలు తీసుకొని కేసీఆర్ పనిచేయడం లేదు. పదేండ్లలో అప్పులు, తప్పులు తప్ప కేసీఆర్ చేసిం దేమి లేదు, అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపెట్టారు. కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులు కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో బయట పెడుతాం’ అని సీఎం చెప్పారు.
ఆ ముగ్గురు తీన్మార్ డ్యాన్సులు..
రైతులు బాధ పడుతున్నారు అని తెలియగానే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తీన్మా ర్ డాన్స్‌లు వేసి పైచాచిక ఆనందం పొందుతున్నారని సీఎం దుయ్యబట్టారు. తెలం గాణలో శవాలు లేస్తున్నాయంటే బీఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని, పంటలు ఎండితే ప్రతిపక్షాలు సంతోషపడుతున్నాయని ఆరోపించారు. ‘ప్రజలు ఇబ్బం దులు పడుతుంటే బాధపడాలి.
ఇంత దు ర్మార్గులు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిన్నది ఎవరు? కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తిచేసివుంటే ఈ తలనొప్పులు ఉండకపోయేవి. ప్రగతిభవన్‌కు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పె ట్టింది ఎవరు? బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీని పడావ్‌పెట్టి కాళేశ్వరం కట్టింది.
రా ష్ట్రంలో కరువు ఉందని అంటున్నారు. పండి న పంట నివేదిక చూసి మాట్లాడాలి తప్ప పి చ్చి మాటలు మాట్లాడటమేంటీ?’ అని సీ ఎం మండిపడ్డారు. గతంలో రెండో పంట 35 లక్షల ఎకరాలు వేశారని, కానీ ఇప్పుడు మొదటిసారి రాష్ర్టంలో 55 లక్షల ఎకరాలలో రైతులు పంటలు వేశారని చెప్పారు. కు లగణనతో సామాజిక న్యాయం జరిగిందని, ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రభా వం వ ల్లే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయని సీఎం తెలిపారు.
ఇటీవల జరిగిన గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు బీజేపీకి ఓట్లు వేయించారని, అం దుకే సిట్టింగ్ సీటును కోల్పోయామన్నారు. హరీశ్‌రావు పూర్తిగా బీజేపీకి లొంగిపోయారని తెలిపారు. డీలిమిటేషన్ కోసం భట్టి విక్ర మార్క అధ్యక్షతన కమిటీ వేసినట్లు పేర్కొన్నా రు. పార్టీ నిర్ణయాలు ప్రెసిడెంట్ తీ సుకుంటారని.. అభ్యర్థుల ఎంపిక విషయం లో పూర్తి స్వేచ్ఛ అధ్యక్షుడికి ఉంటుందన్నారు.
మందకృష్ణ మాదిగ బీజేపీ నాయకుడిలా మాట్లాడుతున్నాడు..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటే తనకు గౌరవం ఉందని, కానీ ఆయన బీజేపీ నాయకుడిగా మాట్లాడితే ఎలా? అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అంశం వర్తించదని, ఏదైనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అన్నారు.
ఇప్పుడు విడుదల చేసే పోటీ పరీక్షల ఫలితాలకు.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ ప్రభుత్వం వర్గీకరణ చేస్తే మాదిగలకు ఎలా అన్యాయం జరిగిందో చెప్పాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏమి మాట్లాడుతున్నారో తనకు తెలియదన్నారు. కేటీఆర్, కిషన్‌రెడ్డిలు కలిసి తిరుగుతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు.