calender_icon.png 3 February, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చకు సిద్ధమా?

03-02-2025 01:24:26 AM

  1. అద్భుతమైన బడ్జెట్‌పై విమర్శలా..
  2. కళ్లున్న కబోదులుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు
  3. బీజేపీ నేత, రాజ్యసభసభ్యుడు కే లక్ష్మణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కరోనా లాంటి గడ్డు పరిస్థితి తర్వాత కఠినమైన నిర్ణయాలు తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ గాడి న పెట్టారని బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్  స్పష్టం చేశారు. బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో ఏం చేశారో.. తమ పాలనలో ఏం చేశా మో అనే అంశంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణలో చర్లపల్లి వంటి అధునాతన రైల్వే టెర్మినల్ నిర్మిస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రమే నిధులు ఇస్తోందని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ సర్కారే నిర్మిస్తోందన్నారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూర్చేలా ఉన్న బడ్జెట్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపె ట్టినా ప్రతిపక్షాలు కళ్లు లేని కబోదులుగా మారి విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే మెదక్‌కు రైలు వచ్చిందన్నారు.