calender_icon.png 18 March, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

చదువే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది

18-03-2025 12:00:00 AM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట కార్యదర్శి శంతన్ రామరాజు

మహబూబాబాద్ మార్చి 17 (విజయ్ క్రాంతి): చదువే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శంతన్ రామరాజు అన్నారు. సోమ వారం శనిగపురం జిల్లాపరిషత్ హైస్కూల్లో పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాశరథి శ్రీధర్ అధ్యక్షతన  ఘనంగా జరిగింది.

ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చే సిన శంతన్ రామరాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళికవసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభు త్వం తీవ్రంగా కృస్గి చేస్తోందన్నారు. శనిగపురం పాఠశాలలో పోయినేడు పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం విజయం సాధించడం గొప్ప విషయమన్నారు.

జిల్లాలో ఎక్కడాలేని విధంగా విద్యార్థులకు  జూమ్ క్లాసుల ద్వారా ఉదయం 4 గంటలకే నిద్రలేపి స్టడీ క్లాసులు నిర్వహించడం విద్యార్థులపట్ల ఉపాధ్యాయుల చిత్తశుద్ధిని తెలుయజేస్తోందని కొనియాడారు. విద్యార్థులు చదువుతోపాటు సమయ పాలన,ఆర్ధిక క్రమశిక్షణ లాంటి ఉత్తమ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. తద్వారా తల్లిదండ్రుల కలలను, చదువు చెప్పిన గురువుల గౌరవాన్ని, మన ఆశయాలను నిజం చేసుకోవచ్చని హితవు పలికారు.

ఆడుతూపాడుతూ పదోతరగతి పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు ఇకనుండి తమభవిష్యత్తును తామే డిజైన్ చేసుకోవాల న్నారు. శనిగపురం ప్రభుత్వ పాఠశాల చదువు, సంస్కారం, ఉత్తమ ఫలితాల్లో మానుకోట జిల్లాకే తలమాని కంగా ఉంటుందన్నారు.

అనంతరం నూరుశాతం హాజరుపట్టిక సాధించిన విద్యార్థులకు జ్ఞాపిక అందజేశారు. ఈసందర్భంగా 10/10 మార్కులు సాధించిన విద్యార్థులకు ఐదువేల రూపాయల పారితోషకం ప్రకటించారు.ఈకార్యక్రమంలో పాఠశాల అధ్యాపక సిబ్బంది జి. వెంకన్న, చాగంటి ప్రభాకర్, బి. వెంకన్న, చైతన్య, పర్వతాలు,మంజులతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.