calender_icon.png 23 February, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకాగ్రతతో చదవండి

21-02-2025 12:00:00 AM

ఎస్‌ఎస్సీ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ 

చేర్యాల, ఫిబ్రవరి 20: రాబోయే నెల రోజులపాటు ఏకాగ్రతతో చదివి పదో తరగతిలో ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణత  సాధించా లని బిఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రం లోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎంఈఓ బి రమేష్ తో కలిసి పరీక్ష ప్యాడ్ లను, కంపాక్స్  బాక్సులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థు లకు ఈ నెల రోజులు అత్యంత విలువైన సమయమని, దాన్ని టీవీ కో, సోషల్ మీడియా కో వినియోగించకుండా చదువుపై శ్రద్ధ పెట్టి పరీక్షలకు సన్నద్ధం  కావాలని సూచించారు. తమ సంస్థ ద్వారా మండలం లోని అన్ని హైస్కూల్ల లో పదో తరగతి విద్యార్థులకు కూడా పరీక్ష ప్యాడ్ లను అందజేస్తామన్నారు.

భవిష్యత్తులో విద్యా పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తనను సంప్రదించాలని కోరారు. ఎస్‌ఎస్సి లో మండల స్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు ప్రోత్సాహకం చేస్తామన్నారు. ప్రథమ స్థానం  పొందిన వారికి రూ. 10 వేల 116 రూపాయలు, ద్వితీయ స్థానం పొందిన వారికి రూ. 5 వేల నూట 16 రూపాయలు  అందజేస్తామని హామీనిచ్చారు.

అనంతరం ఎంఈఓ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో రాజేందర్ రెడ్డి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరాలని అభిలాషించారు. ఇటువంటి దాణగుణం ఉన్నవారికి  భగవంతుడు ఎప్పు డూ తోడ్పాటు అందిస్తారన్నారు. కార్యక్ర మంలో సంస్థ ప్రతినిధి గజ్జె  వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.