బైంసా (విజయక్రాంతి): బైంసా మండలం మిర్జాపూర్ మహాగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలను శ్రద్ధతో విని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు. నేటి తరం పిల్లలు సెల్ ఫోను వాడటం, ఎక్కువగా టీవీ చూడడం చేస్తున్నారని వాటిని తగ్గించుకోవాలన్నారు. ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.