29-04-2025 12:00:00 AM
తల్లిదండ్రులు బిడ్డలకు సంపాదించి ఇవ్వడం కాదు.. చదువును అందించండి
ఇంటర్ విద్యార్థులకు నీట్, ఎంసెట్, నిరుద్యోగ అభ్యర్థులకు టెట్, డీఎస్సీ, కానిస్టేబుల్, ఎస్సై ఉచిత కోచింగ్
వేసవిలోనూ భోజన సదుపాయాలు కల్పించి కోచింగ్ అందిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 28 (విజయ క్రాంతి) : పాలమూరు పరువు ప్రపంచానికి చాటి చెప్పేలా ఆచరణలకు అంకురార్పణ జరుగుతుంది. ఉన్నత విద్యను అందిపుచ్చుకొని... దేశ విదేశాలలో పాలమూరు బిడ్డలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మం చి పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలని, మీ తల్లిదండ్రుల కలలను నిజం చేసేలా భావితరాలకు భవిష్యత్తును అందించేలా...
ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని అ ద్భుతంగా చదవండి.. అంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేద విద్యార్థుల కు బాసటగా నిలుస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి మహానగరాల్లో కోచింగ్ ల పేర్లతో దోపిడీ చేస్తున్న వారి నుంచి దాపెడుతూ పట్టణంలోనే అద్భుతమైన కోచింగ్ అందుబాటులోకి ఉచితంగా అందిస్తానంటూ ఎమ్మెల్యే ముందు కు వచ్చారు.
దీంతో బాల, బాలికలకు ప్రభుత్వ వసతి గృహాలలో వేసవిలో సైతం.. తిరిగి ప్రారంభించి భోజన సదుపాయాలను కల్పిస్తూ నీట్ ఎంసెట్ తో పాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటూ పాలమూరు పేద విద్యార్థులకు అండగా ఉంటున్నారు.
చదువే తరాలను మార్చివేస్తుంది...
ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం ఒక్క చదువు మాత్రమే మీ తలరాతతో పాటు మీ భవిష్యత్తు కుటుంబాల తలరాతను కూడా మార్చే శక్తి ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిత్యం చెబుతుంటారు. ఆదిశగానే మహబూబ్ నగర్ లో కానిస్టేబుల్, ఎస్త్స్ర, డీఎస్సీ, టెట్ పరీక్షలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో ప్రత్యేకమైన కోచింగ్ అందిస్తూ ఉద్యోగాలు సాధించాలనే తపనతో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్ భోజన సదుపాయాలను కల్పిస్తూ ఉన్నారు.
నీట్ ఎంసెట్ విద్యార్థులకు సైతం తన క్యాంపు కార్యాలయం నుంచి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ స్టడీ చైర్స్, స్టడీ మెటీరియల్ తో పాటు వసతి గృహాలలో భోజనాన్ని అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆసక్తిగా ఉచి తంగా ఏర్పాటుచేసిన కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్నారు. నిరుద్యోగ అభ్యర్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ప్రత్యే కంగా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఆదర్శంగా విద్యానిధి..
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ వివిధ అంశాలకు సంబంధించి ఖర్చు చేసేందుకు విద్యానిధిని ఎమ్మె ల్యే ఆవిష్కృతం చేశారు. ఇప్పటికే ప్రతి నెల తన వేతంలో నుంచి లక్ష రూపాయలు కలెక్టర్ చైర్మన్గా ఉన్న విద్యా నిధికి అంది స్తున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఉద్యోగులు, సహాయం చేద్దామనుకునే పారిశ్రామికవేత్తలు విద్యాసంస్థల యజమా నులు, ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలు పునిచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో విద్యా నిధి అద్భుతంగా నిధుల సేకరణ జరుగుతుంది.
రాబోయే విద్యా సంవత్సరంలో పేద విద్యార్థులకు ఈ విద్యానిధి ద్వారా మరింత మేలు జరిగే అవకాశం మెండిగా ఉంటుంది. గత ఏడాది కూడా విద్యార్థులకు నోటు పుస్తకాలు స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి విద్య అం దుబాటులోకి ఉంచాలని సంకల్పంతో ఎమ్మెల్యే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
చదివి ఉంటే.. అన్ని ఉంటాయి...
పేదలు అని మొదటగా వచ్చేది చదువు లేకపోవడమే. ఇంట్లో ఒక్కరైనా ఉన్నత స్థాయిలో ఉంటే ఆ కుటుంబమంతా ఉన్నత స్థాయికి ఎలా వెళ్లాలి అని మార్గ నిర్దేశకులు అవుతారు. ఆదిశగానే విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలను అధిరోహించల చదువుకోవాలని సంకల్పానికి మనం ఇంత తోడునివ్వాలనా ఆశతో విద్యానిధి ఉచిత కోచింగ్లను అందుబాటులో ఉంచుతున్నాం.
విద్యానిధికి నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు ప్రజాప్రతినిధులు ,విద్యాసంస్థలు ,పారిశ్రామికవేత్తలు, పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు. మునుముందు మరిన్ని నిధులు సేకరించి మరింత పేద విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను దరి చేర్చడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్