గజ్వేల్ పత్తి మార్కెట్ యార్డును త్వరలో వినియోగంలోకి తెస్తాం
పత్తి మార్కెట్ ను సందర్శించిన వ్యవసాయ మార్కెట్ పాలకమండలి
రైతులు దళారులను, ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు
త్వరలో సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభం
ఏఎంసీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి
గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలో నిరుపయోగంగా ఉన్న పత్తి మార్కెట్ యార్డు పై విజయ క్రాంతిలో ఈనెల 25వ తేదీన '' నిర్మించారు- వదిలేశారు'' అన్న శీర్షిక ప్రచురితమైన వార్తకు బుధవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం స్పందించింది. గజ్వేల్ పట్టణ శివారులో గల పత్తి మార్కెట్ యార్డును బుధవారం గజ్వేల్ ఏఎంసి చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఏఎంసి సెక్రటరీ జాన్ వెస్లీ, డైరెక్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు అవసరమైన మౌలిక వస్తువులను ఏర్పాటు చేసి పత్తి మార్కెట్ యార్డ్ లో త్వరలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గజ్వేల్ ప్రాంత రైతులు పత్తిని దళారులకు అమ్మి మోసపోవద్దని, త్వరలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ పండించిన పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి అధిక ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో కర్ణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, వహీద్, మహంకాళి శ్రీనివాస్, యాదయ్య శ్రీనివాస్ గౌడ్, రామా గౌడ్, సూపర్వైజర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.