calender_icon.png 22 April, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోండి

21-04-2025 12:29:00 AM

అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డా చంద్రకిరణ్ 

పాలమూరు యూనివర్సిటీ ఏప్రిల్ 20 :  యూనివర్సిటీ పీజీ కాలేజీ యందు సెమినార్ హాల్లో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు 4వ సంవత్సర విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.చంద్రకిరణ్  హాజరై మాట్లాడారు. నిర్దేశించుకున్న లక్ష్యం వైపు చేరుకోవాలన్నారు.

కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, రీసెర్చ్ ను కెరీర్ గా ఎంచుకోవాలని, అందరికంటే భిన్నంగా ఆలోచించి, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని, గొప్ప శాస్త్ర వేత్త లు గా సమాజానికి సేవ చెయ్యాలని, మీ బలమే మీకు ఆయుధమని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, రామ్మోహన్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డా సిద్దరామ గౌడ్, డా రామరాజు, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ డా రవికాంత్  విద్యార్థులు పాల్గొన్నారు.