22-04-2025 07:58:57 PM
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లబ్ధిదారుల గ్రామ ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులను గుర్తించి మండల స్థాయి అధికారులను మళ్లీ వెరిఫికేషన్ చేయుటకు మంగళవారం మండలంలోని లింగుపల్లి గ్రామమునకు వెళ్లి 12 మంది లబ్ధిదరులకు ఎంపిక చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్(MPDO Praveen Kumar) తెలిపారు. ఇందులో రెండు కుటుంబాల వారు ఇల్లు కట్టుకొనుటకు నిరాకరించినట్లు ఆయన తెలిపారు.
మండలంలో అన్ని గ్రామపంచాయతీల ఇందిరమ్మ కమిటీ సభ్యులు మంజూరు అయినా లబ్ధిదారులు వెంటనే ఇల్లు కట్టుకునే వారికి ఇవ్వవలసిందిగా ప్రభుత్వాదేశాలు ఉన్నందున ఇల్లులేని నిరుపేదలకు ఇట్టి పథకం వర్తింపజేయాలని రీ వెరిఫికేషన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. రేపటి నుంచి మండలంలోని మిగతా గ్రామాలలోని ఇంద్రమ్మ కమిటీలు సూచించిన లబ్ధిదారులను పరిశీలించి నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేసిన వారి పేర్లను లిస్టు నుంచి తొలగిస్తామని ఆయన సూచించారు. తనతో పాటు ఏఈ బాలకృష్ణ, సెక్రటరీ తదితరులు ఉన్నారు.