calender_icon.png 5 February, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీ సర్వే చేయాలి: తలసాని

05-02-2025 01:34:25 AM

కులగణన సర్వేపై అనేక అనుమానాలు ఉన్నాయని, గత పదిహే నేళ్లలో బీసీల జనాభా పెరగలేదని చెప్పడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అసహనం వ్యక్తంచేశారు. జీహెచ్‌ఎంసీలో 30 శాతం మంది కూడా సర్వేలో పాల్గొనలేదని పేర్కొన్నారు. సర్వేలో చాలా అంశాలు ఉండటం వల్ల అనేక మం ది సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చలేదని గుర్తుచేశారు. అందుకే ఫార్మాట్‌ను మార్చి రీ సర్వే చేయాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 3.54 కోట్ల మంది ఉన్నారని, ఈ సర్వే ద్వారా ఏ కులం ఎంత పెరిగిందో చెప్పాలని డిమాండ్‌చేశారు.