calender_icon.png 29 April, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల రీ సర్వే

29-04-2025 12:02:44 AM

క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ప్రత్యేక అధికారులు 

ఈనెల 30 వరకు అర్హుల జాబితాకు కసరత్తు ముమ్మరం

 రంగారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి ): ఇందిరమ్మ ఇండ్ల రీసర్వ్పై అధికారులు స్పీడ్ పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అర్హులకు లబ్ధి చేకూర్చేలా అధికారులు మమ్మర కసరతులు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో 21 మండలాలు 16 మున్సిపాలిటీలు మూడు కార్పోరేషన్ లో ఇళ్ల పథకమును అమలు చేయనున్నారు. ఇందులో మొదటి విడతలో భాగంగా ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున పైలే ట్  ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఇళ్ల ను మంజూరు చేసింది.

పైలెట్ ప్రాజెక్టు లో లబ్ధిదారుల కు మొదటి విడతలో పనులను బేస్మెంట్ లెవల్ పూర్తి చేసిన వారికి ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒక్కొక్క లబ్ధిదారుకు లక్ష రూపాయలు చెక్కును అందజేశారు. అట్టి డబ్బు ల ను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ప్రజా పాలనలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులను ఎంపిక చేసేందుకు అధికారుల కు ప్రభుత్వం బాధ్యత లు అప్పగించింది. మళ్లీ క్షేత్రస్థాయిలో మండలాల్లో, గ్రామాల వారిగా ప్రత్యేకత  అధికారులు నియమించి రి సర్వే చేస్తున్నారు.ఈ సర్వే ఈనెల 30 వరకు అధికారులు పూర్తి చేయనున్నారు.

 పకడ్బందీగా  అర్హుల ఎంపిక....

 రంగారెడ్డి జిల్లాలో 8  నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసింది. ఆయా నియోజకవర్గాల్లోని మండలాలు గ్రామాలలో  దానిలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను  ఎంపికలో ఎక్కడ పొరపాట్లు తావు లేకుండా గెజిటెడ్ అధికారు లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఆయా గ్రామాలలో ఇటీవలనే ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను పంచాయతీలో వెల్లడించారు. అట్టి అర్హులను తుది ఎంపిక చేసేందుకు గెజిటెడ్ అధి కారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ లబ్ధిదారుల  ఇంటికి వెళ్లి  పరిశీలన చేస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు వీళ్ళు అర్హులా కా రా అంటూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

ఇలా నిర్మాణంకు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే పలు అంశాలలో అధికారులు లబ్ధిదారుల గురించి ఆరా తీస్తున్నారు. ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు  జిల్లాలో అన్ని మండలాలు, మున్సిపాలిటీ,కార్పొరేషన్ లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేస్తారు. అనంతరం మే ఒకటి నుంచి అర్హుల జాబితాను తుది ఎంపిక చేసి మండలాల వారీగా ఎంపీడీవో లాగిన్ కు... అందజేసి మెరిట్ లిస్టు మే 2న లిస్టు గ్రామపంచాయతీలో కార్యాల వద్దకు ప్రకటిస్తారు.

మూడు, నాలుగు తేదీల్లో ఆన్లైన్లో హోటల్లో వారి వివరాలను పరిశీలిస్తారు.మే 5న గెజిస్టర్ అధికారుల అర్హుల జాబితాను రూపొందించి నివేదికలను జిల్లా అధికారులకు  ప్రత్యేక అధికారులు నివేదిస్తారు. అనంతరం ఎంపికైన లబ్ధిదారులు మే 5 నుంచి ఇలా నిర్మాణము చేపట్టేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు . ఇళ్ల నిర్మా ణం కోసం ప్రభుత్వ నిబంధన ప్రకారము కొలతలను ఇచ్చి గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్ద కు వెళ్లి శంకు స్థాపన చేసి పనులు ప్రారంభిస్తారు.

 అర్హుల కే ఇందిరమ్మ ఇల్లు....

 ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు ఎంపిక విషయంలో అధికారులు క్షేత్ర పర్యటన చేస్తున్నారు. లబ్ధిదారుల విషయంలో  ప్రభుత్వ నిబంధన ప్రకారం  అర్హులా కాదా అంటూ  ప్రత్యేక యాప్ లో  లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నాం. ఈనెల 30 వరకు  జిల్లాలో సర్వే పూర్తి చేసి పూర్తి నివేదికను సిద్ధం చేస్తాం. అనంతరం లబ్ధిదారుల వివరాలను గ్రామపంచాయతీలో ప్రకటిస్తాం.

 -డీ సీ నాయక్, గృహ నిర్మాణ శాఖ అధికారి.