calender_icon.png 6 March, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ

11-12-2024 12:00:08 PM

హైదరాబాద్, (విజయక్రాంతి): సికింద్రాబాద్ కుమ్మరిగూడలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో సికింద్రాబాద్ ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. స్థానిక శాసన సభ్యుడి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తక్షణమే స్పందించి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు.  ఎక్కడైనా దేవాలయాలు ప్రార్థన మందిరాల పట్ల రాజకీయం మంచిది కాదన్నారు. ఆ ముత్యాలమ్మ వారికి రెండు చేతులు జోడించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.