రామాయంపేట (విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా సర్వే కార్యక్రమంలో భాగంగా రామాయంపేట మండలంలో రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజు ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి మెదక్ ఆర్డిఓ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో రైతు భరోసా సర్వేలో సాగుకు యోగ్యమైన భూములు, సాగుకు యోగ్యం కాని భూములపై చేసిన సర్వే సమగ్ర నివేదికలను ఆమె క్షుణంగా పరిశీలించారు. అనంతరం మండల రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులతో ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీకుమారి, మండల ఆర్ఐ. గౌసోద్దీన్, గోపి, మండల సిబ్బంది పాల్గొన్నారు.