calender_icon.png 18 April, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్.డి.ఓ.

10-04-2025 08:30:03 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం నాడు ఎల్లారెడ్డి ఆర్డిఓ మన్నె ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు దళారులకు ధాన్యం విక్రయించి వారి చేతిలో మోసపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత,డిసిసిబి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సాయిలు, పిఎసిఎస్ డైరెక్టర్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అలీ పాషా, గ్రామస్తులు నరసింహారెడ్డి, సాయిరెడ్డి, గంగారెడ్డి, సాయ గౌడ్, ప్రభాకర్, నారాయణ, గంగారం, ఏ ఈ ఓ రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.