22-03-2025 09:06:13 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట తాసిల్దార్ కార్యాలయాన్ని తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం కార్యాలయంలో ఉన్న అన్ని రిజిస్టర్ లను, ధరణి అప్లికేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశానుసారం కార్యాలయంలో ఉన్న అన్ని రిజిస్టర్ లను జాగ్రత్తగా పెట్టి, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.